హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎంకి చెప్తా:దత్తాత్రేయ, మెట్రో అద్భుతం(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

బీజేపీ: మెట్రో రైలును ప్రయాణీకులకు త్వరగా అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరింత చొరవ చూపాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ శనివారం అన్నారు. చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి యాజమాన్యం, ప్రభుత్వం సత్వరం చర్యలు చేపట్టాలన్నారు.

తాను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసి సమస్యలపై సమగ్రంగా చర్చిస్తానన్నారు. మెట్రో ప్రాజెక్టు పూర్తికి కేంద్రం సహకరిస్తుందని, ప్రాజెక్ట్ ప్రారంభానికి ప్రధాని మోడీ వస్తారని చెప్పారు. నాగోల్ మెట్రో స్టేషన్, ఉప్పల్ డిపోలను దత్తాత్రేయ పరిశీలించారు.

భూములు కోల్పోయిన వారికి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్ అన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో మెట్రో రైలు ప్రారంభం ఉండొచ్చని హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్ఎంఆర్) ఎండీ ఎన్వీవీఎస్ రెడ్డి చెప్పారు. కాగా, వచ్చే ఏడాది ఆరంభంలో మెట్రో రైలు ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది.

మెట్రో రైలు

మెట్రో రైలు

మెట్రో పనులను చిన్న చిన్న సాకులుచెప్పి జాప్యం చేయవద్దని, సాంకేతిక ఇబ్బందులు ఉంటే వాటిని అధిగమించి పనులను వేగవంతం చేయాలని బండారు దత్తాత్రేయ అధికారులను ఆదేశించారు.

 మెట్రో రైలు

మెట్రో రైలు

ఉప్పల్ ప్రాంతంలో మెట్రో పనులను ఆయన సీనియర్ అధికారులు, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్ తదితరులతో కలిసి సమీక్షించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు.

 మెట్రో రైలు

మెట్రో రైలు

కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న భూసేకరణ బిల్లు వల్ల రైతులకే లాభదాయకమని, అన్ని రాష్ట్రాలూ బిల్లుకు మద్దతు పలకాలని సూచించారు.

 మెట్రో రైలు

మెట్రో రైలు

హైదరాబాద్ మెట్రో కోసం 840 ఎకరాల భూమిని సేకరించినా, దానిని అభివృద్ధి చేసిన తర్వాత మళ్లీ రైతులకే 400 ఎకరాల వరకూ ఇచ్చామని, ఇపుడు అది కోట్ల రూపాయిలు పలుకుతోందని చెప్పారు.

 మెట్రో రైలు

మెట్రో రైలు

మెట్రో రైలును త్వరగా పూర్తి చేసి నగర వాసులకు అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 2001లో మెట్రో ప్రాజెక్టు కోసం తాను ఎంతో కష్టపడ్డానని, మెట్రో ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం 2500 కోట్లు కేటాయించిందన్నారు.

 మెట్రో రైలు

మెట్రో రైలు

మెట్రో ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తారని దత్తాత్రేయ అన్నారు. ఎపుడు ప్రారంభించాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమేనని ఎన్వీవీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.

మెట్రో రైలు

మెట్రో రైలు

ఇంతవరకూ 50 శాతం మెట్రో పనులు పూర్తయ్యాయన్నారు. 43 కిలోమీటర్ల మేర పిల్లర్లు వేశామని ఆయన చెప్పగా, సాంకేతిక అంశాలపై తాను అవసరమైతే సిఎంను కలుస్తానని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు.

 మెట్రో రైలు

మెట్రో రైలు

మెట్రో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని దత్తాత్రేయ కోరారు. భూముల ఒప్పందాల వంటి విషయాల్లో సమస్యలుంటే వాటి పరిష్కారానికి సత్వరం చర్యలు చేపట్టాలని అన్నారు.

 మెట్రో రైలు

మెట్రో రైలు

తాను స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి వీటిపై సమగ్ర చర్యలు చేపట్టమని కోరుతానని బండారు దత్తాత్రేయ అన్నారు.

 మెట్రో రైలు

మెట్రో రైలు

కాగా, హైదరాబాద్ మెట్రో రైలు మహిళా డ్రైవర్లు నడపనున్నారు. ఇప్పటి వరకు 52 మందిని నియమించారు. అందులో ఏడుగురు మహిళా డ్రైవర్లు ఉన్నారు. ప్రస్తుతం నాగోల్ - మెట్టుగూడ మార్గంలో ప్రయోగాత్మకంగా రైళ్లను నడిపి చూస్తున్నారు.

మెట్రో రైలు

మెట్రో రైలు

మియాపూర్ - ఎస్సార్ నగర్ మార్గంలో ప్రయోగాత్మకంగా మెట్రో రైలు పరీక్షలకు సిద్ధమయ్యారు. ఇక్కడ మొత్తం పది రైళ్ల వరకు నడపనున్నారు. రెండు డిపోలకు 28 మెట్రో రైళ్లు వచ్చాయని ఎల్ అండ్ టీ వర్గాలు చెప్పాయి.

English summary
Bandaru Dattatreya seeks early completion of Hyderabad metro project
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X