వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ఇస్తున్నారు.. మీరు: రేవంత్ 'హైదరాబాద్'కు చంద్రబాబు నో!

తెలంగాణలో తెలుగుదేసం పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని టిటిడిపి నేతలకు టిడిపి జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం సూచించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విజయవాడ: తెలంగాణలో తెలుగుదేసం పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని టిటిడిపి నేతలకు టిడిపి జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం సూచించారు.

తెలంగాణకు చెందిన పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీలోని 11 మంది ముఖ్య నేతలు సోమవారం రాత్రి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో అధినేతతో సమావేశమయ్యారు.

అఖిలప్రియ యూ టర్న్: చంద్రబాబు ఫోకస్అఖిలప్రియ యూ టర్న్: చంద్రబాబు ఫోకస్

ఈసారి మహానాడు హైదరాబాద్‌లో నిర్వహించాలని, పార్టీ బలోపేతానికి అది దోహదపడుతుందని రేవంత్ రెడ్డి సహా, తెలంగాణ నేతలు కోరారు. దానికి చంద్రబాబు స్పందిస్తూ.. ఈసారికి మహానాడు విశాఖలో నిర్ణయించామని, వీలైతే ఆ తర్వాత వచ్చే మహానాడు హైదరాబాద్‌లో పెడదామన్నారు.

ఇదీ ప్రధాని ఆలోచన

ఇదీ ప్రధాని ఆలోచన

దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన చేస్తున్నారని చంద్రబాబు టి-టిడిపి నేతలకు చెప్పారు. నీతి ఆయోగ్‌ సమావేశం సందర్భంగా కూడా ఇదే అంశాన్ని ప్రధాని రెండుసార్లు ప్రస్తావించారన్నారు.

సిద్ధంగా ఉండండి

సిద్ధంగా ఉండండి

ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఉద్దేశంతో ఇప్పటి నుంచే సిద్ధం కావాలని చంద్రబాబు సూచించారు. మహానాడులోగా తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఏం చర్యలు చేపడతారో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి తీసుకురావాలని, మంగళవారం మధ్యాహ్నం మరోసారి సమావేశమై చర్చిద్దామన్నారు.

తెరాసలోకి వెళ్లిన చోట

తెరాసలోకి వెళ్లిన చోట

తెలంగాణలో మంత్రుల నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న ప్రజాపోరును ఈ నెల 28న తాండూరులో, తర్వాత సిద్దిపేట, సిరిసిల్ల, పాలేరుల్లో నిర్వహించనున్నామని తెలంగాణ నేతలు... చంద్రబాబుకు తెలిపారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని, పార్టీ నాయకులు తెరాసలోకి వెళ్లిన చోట్ల నాయకత్వాన్ని పటిష్ఠం చేయాలన్నారు.

ముందస్తు వస్తే.... భారీ సభ మీ ఇష్టం

ముందస్తు వస్తే.... భారీ సభ మీ ఇష్టం

ముందస్తు ఎన్నికలు వస్తే ఎలాంటి వ్యూహాలు అనుసరించాలన్న దానిపై మహానాడులో చర్చిద్దామని చంద్రబాబు అన్నారు. జిల్లా స్థాయిలో మినీ మహానాడులు నిర్వహించాలని, రాష్ట్రస్థాయిలోను భారీ సభ పెడతారా? అన్న దానిపై నాయకులే చర్చించి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు వారికి సూచించారు.

కేసీఆర్ ఇలా చేస్తున్నారు.. మరి

కేసీఆర్ ఇలా చేస్తున్నారు.. మరి

తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎరువుల కొనుగోలుకు ఎకరానికి రూ.4 వేలు చొప్పున ఇస్తోందని నాయకులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. తెలంగాణలో మిగులు బడ్జెట్‌ ఉండడంతో ఇవ్వగలుగుతున్నారని, ఏపీలో ఆర్థిక ఇబ్బందులున్నా మిర్చి రైతుల్ని ఆదుకునేందుకు క్వింటాకు రూ.1500 చొప్పున ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

ఎన్నికల వ్యూహాల వేరే..

ఎన్నికల వ్యూహాల వేరే..

ఎన్నికల నాటికి అవన్నీ ప్రాధాన్యాంశాలు కావని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. ఎన్నికల వ్యూహాలు వేరే ఉంటాయన్నారు. ఈ సమావేశంలో ఎల్‌ రమణ, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఉమామాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English summary
AP CM Nara Chandrababu Naidu on Monday suggested Telangana TDP leaders that they should ready for Early elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X