వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిరీష మృతి, రాజీవ్ రాసలీలలు: శ్రవణ్-రాజీవ్‌ల విచారణకు ఓకే

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో రాజీవ్, శ్రవణ్‌లను అయిదు రోజుల కస్టడీకి అప్పగించాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో రాజీవ్, శ్రవణ్‌లను అయిదు రోజుల కస్టడీకి అప్పగించాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

విచారించి...

విచారించి...

ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు రాజీవ్, శ్రవణ్‌లను రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 26, 27 తేదీల్లో వీరిని కస్టడీలోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీసులు విచారిస్తారు.

అనుమానాల నివృత్తి కోసం..

అనుమానాల నివృత్తి కోసం..

గతంలో రాజీవ్, శ్రవణ్‌లను అయిదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ కేసులో అనుమానాల నివృత్తి కోసం రెండు రోజులు వారిని పోలీసుల కస్టడీకి అప్పగించింది.

రాజీవ్‌పై రాసలీలల అనుమానాలు

రాజీవ్‌పై రాసలీలల అనుమానాలు

కాగా, శిరీష మృతి కేసు అనంతరం రాజీవ్, శ్రవణ్‌ల గురించి షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాజీవ్ నాలుగైదు నెలలకు ఓసారి అమ్మాయిని మార్చేవాడని, తనతో సన్నిహితంగా ఉండే యువతులకు తెలియకుండా వీడియోలు చిత్రీకరించేవాడని వాదనలు వినిపించాయి. శిరీషకు ముందు కూడా రాజీవ్ మరికొందరిని మోసం చేశాడని అంటున్నారు.

వాడుకొని వదిలేసేవాడని..

వాడుకొని వదిలేసేవాడని..

శిరీషను వదిలించుకునేందుకు రాజీవ్.. తేజస్వినిని ఉపయోగించుకునే ప్రయత్నం చేశాడని, ఆ తర్వాత తేజస్వినిని కూడా వదిలించుకోవాలని భావించాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో శిరీష ఆత్మహత్యకు గల కారణాలను, కుకునూరుపల్లి ఎస్సై ఆత్మహత్యతో గల సంబంధాలను పోలీసులు వారి నుంచి రాబట్టే ప్రయత్నం చేయనున్నారని తెలుస్తోంది.

English summary
Court gave two days police custody to Beautician Sirisha suicide accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X