హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీఫ్ ఫెస్టివెల్: కోర్టు ఆదేశాలు బేఖాతర్, 12మంది విద్యార్థుల అరెస్ట్, ఎమ్మెల్యేపై కేసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కోర్టు తీర్పును ధిక్కరించి ఉస్మానియా విశ్వవిద్యాలయ హాస్టల్‌లో బీఫ్ ఫెస్టివెల్ నిర్వహించిన 12 మంది విద్యార్థులను పోలీసులు శుక్రవారం నాడు అరెస్టు చేశారు. బీఫ్ లేదా పోర్క్ ఫెస్టివెల్ వంటివి ఓయులో నిర్వహించరాదని సిటీ సివిల్ కోర్టు చెప్పింది. హైకోర్టు ఆ తీర్పును సమర్థించింది.

విద్యార్థులు స్వార్థపరుల చేతిలో ఆయుధం కావొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయినప్పటికీ కొందరు విద్యార్థులు బీఫ్ ఫెస్టివెల్ నిర్వహించారు. దీంతో ఉస్మానియా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది. 12 మంది విద్యార్థులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.

PHOTOS: ఓయులో బీఫ్ ఫెస్టివల్

సాక్ష్యాల ఆధారంగా మరికొంతమంది విద్యార్థులను అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. విద్యార్థులను అరెస్టు చేసినట్లు డిసిపి రవీందర్ తెలిపారు. విద్యార్థులు కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించారని, అందుకే కేసు నమోదు చేశామని చెప్పారు. మరోవైపు, ఎమ్మెల్యే రాజా సింగ్ పైన కేసు నమోదయింది. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ బొల్లారం పోలీసు స్టేషన్‌లో అతని పైన పోలీసు కేసు నమోదయింది.

బీఫ్ ఫెస్టివెల్

బీఫ్ ఫెస్టివెల్

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాలు గురువారం నిర్వహించిన బీఫ్ ఫెస్టివెల్ వివాదాస్పదంగా మారింది. నిర్వహించకూడదంటూ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ విద్యార్థులు నిర్వహించారు.

బీఫ్ ఫెస్టివెల్

బీఫ్ ఫెస్టివెల్

గొడ్డుమాంసం పండుగను నిరసిస్తూ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లోథ్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 8 గంటలకు లోయర్‌ ట్యాంక్ బండ్‌ నుంచి ఓయూ వరకూ ర్యాలీ తలపెట్టారు.

బీఫ్ ఫెస్టివెల్

బీఫ్ ఫెస్టివెల్

ఆయనను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో కొందరు ఓయు వైపు ఫెస్టివెల్ అడ్డుకునేందుకు ర్యాలీగా వెళ్లారు. వారిని కూడా పోలీసులు అడ్డుకున్నారు.

బీఫ్ ఫెస్టివెల్

బీఫ్ ఫెస్టివెల్

బీఫ్ ఫెస్టివెల్ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భారీగా పోలీసులు మోహరించారు. వేడుకలను నిర్వహించేందుకు ప్రయత్నాలు చేసిన విద్యార్థి సంఘాల ప్రతినిధులను, వ్యతిరేకిస్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు.

English summary
Osmania University Police arrested 12 students for beef festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X