వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సంబరం సరే, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఓట్లు పడకపోవడానికి ఇదీ కారణం'

మహారాష్ట్ర, ఒడిశా స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. బీజేపీ గెలుపు పైన తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విజయవాడ: మహారాష్ట్ర, ఒడిశా స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. బీజేపీ గెలుపు పైన తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

అయితే, ఇతర రాష్ట్రాల్లో గెలిచినప్పుడు సంబరాలు చేయడం కన్నా ఇక్కడ గెలిచేలా కార్యాచరణ రూపొందించాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పార్టీ క్యాడర్‌కు రెండ్రోజుల క్రితం హితవు పలికారు. ఇంటింటికి బీజేపీని తీసుకు వెళ్లాలని సూచించారు.

<strong>వైయస్ చనిపోయినా: జగన్ మీద మాజీ సీఎస్ రమాకాంత్ షాకింగ్ వ్యాఖ్యలపై టిడిపి</strong>వైయస్ చనిపోయినా: జగన్ మీద మాజీ సీఎస్ రమాకాంత్ షాకింగ్ వ్యాఖ్యలపై టిడిపి

అంతేకాదు, బీజేపీకి తెలుగు రాష్ట్రాలలో ఓట్లు ఎందుకు పడటం లేదో కూడా చెప్పారు. తెలంగాణ, ఏపీలలో గెలుస్తామన్న నమ్మకాన్ని బీజేపీ సానుభూతిపరులకు ఇవ్వలేకపోతున్నామని, అందుకే వారు ఓటు వేయడం లేదని చెప్పారు.

Behind BJP not getting votes in Telugu States

అండమాన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు బీజేపీ పలు ఎన్నికల్లో విజయం సాధించిందని చెప్పారు. యూపీఏ హయాంలో వేమల రోహిత్ తరహా ఎన్ని జరిగినా ఎవరూ మాట్లాడలేదని వెంకయ్య అన్నారు. ఇప్పుడు మాత్రం జాతిద్రోహం, హత్యలు అంటూ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

<strong>చేయలేం, రూ.50వేలు ఇస్తాం: యనమల, కొత్తగా.. జగన్ లేఖ</strong>చేయలేం, రూ.50వేలు ఇస్తాం: యనమల, కొత్తగా.. జగన్ లేఖ

తెలంగాణలో బలమైన శక్తిగా బీజేపీ మారాలని, ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలని, ఎవరిని దూషించకుండా విమర్శలు చేయాలని వెంకయ్య అన్నారు.

English summary
Union Minister and BJP leader Venkaiah Naidu reveled why BJP is not getting votes in Telugu speaking States.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X