హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండో'సారీ': మహిళలకు వేధింపు! ఏపీ ఉద్యోగిని చితకబాదారు! (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో బుధవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళా ఉద్యోగులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, వేధింపులకు గురి చేస్తున్నాడని సాంఘిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రావు పైన ఉద్యోగులు చేయి చేసుకున్నారు.

అతడిని సీట్లో నుంచి బయటకు లాక్కొచ్చి, ఆందోళన చేశారు. అవినీతికి పాల్పడటమే కాకుండా తమను వేధిస్తున్నారని అటెండర్ నుంచి పైస్థాయి ఉద్యోగుల పైనా అతడి వేధింపులు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు.

సర్వీసులు, సెలవులకు సంబంధించి కూడా అతను వేధిస్తున్నాడని చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా పద్ధతి మార్చుకోవాలని చెబుతున్నా, అతడు తీరు మార్చుకోకపోవడంతో తాము నేడు చేయి చేసుకున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. కాగా, ఉద్యోగుల విభన అంశమే వివాదానికి దారి తీసిందని మరికొందరు అంటున్నారు. శ్రీనివాస రావుది ఏపీ స్థానికత అని చెబుతున్నారు.

సచివాలయంలో ఉద్రిక్తత

సచివాలయంలో ఉద్రిక్తత

శ్రీనివాస రావు ఎస్సీ డెవలప్‌మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ బెన్హూర్ మహేష్ దత్త ఎక్కాకు పర్సనల్ సెక్రటరీ. వివాదంపై శ్రీనివాస రావు మాట్లాడుతూ.. తనను కొందరు తెలంగాణ ఉద్యోగులు తన చాంబర్ నుంచి లాగి పడేశారని, తనను కొట్టారని చెబుతున్నారు.

సచివాలయంలో ఉద్రిక్తత

సచివాలయంలో ఉద్రిక్తత

తాను ఏపీకి చెందిన వాడినని అందుకే తనను టార్గెట్ చేశారని చెబుతున్నారు. తాను ఏపీకి చెందిన వాడినయినా, తెలంగాణలో ఆప్షన్ పెట్టుకున్నానని చెప్పారు. మరోవైపు శ్రీనివాస రెడ్డి ఆరోపణలను తెలంగాణ స్టేట్ సెక్రటరియేట్ ఎంప్లాయీస్ అసోసియేష్ సెక్రటరీ పద్మాచారి కొట్టి పారేసారు.

 సచివాలయంలో ఉద్రిక్తత

సచివాలయంలో ఉద్రిక్తత

మరికొందరి వాదన మేరకు.. అతను ఇష్టారీతిగా సెలవులు పెడుతున్నాడని, అసలు శ్రీనివాస రావును కొట్టలేదని, అయితే ఉద్యోగులను వేధిస్తున్నందుకు అతనిని వారించామని చెబుతున్నారు.

సచివాలయంలో ఉద్రిక్తత

సచివాలయంలో ఉద్రిక్తత

తెలంగాణ సచివాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకోవడం గత పది రోజుల్లో ఇది రెండవది. గత వారం నవీన్ మిట్టల్‌కు అప్పుడు పర్సనల్ సెక్రటరీగా ఉన్న పద్మావతి తమను వేధిస్తున్నారని ఉద్యోగులు ఆమెను బదలీ చేసే వరకు ఊరుకోలేదు. తాజాగా, శ్రీనివాస రావు విషయం వెలుగు చూసింది. పద్మావతి ఏపీ క్యాడర్ ఉద్యోగి అని, ఆమె నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడకు వచ్చారని ఆరోపించారు. శ్రీనివాస రావు విషయంలో మాత్రం రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి మహిళలకు వేధింపు, రెండోది ఏపీ స్థానికత.

English summary
IN A second such incident in less than 10 days, an employee from Andhra Pradesh working at the Telangana Secretariat was allegedly harassed and manhandled by the employees from Telangana on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X