వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు భగవంత్ ఖూబా భయం, కారణమిదే!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులకు బిజెపి వలవేస్తోంది.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలకు బిజెపి నేత భగవత్ ఖూబా ఫోన్లు చేసి మరీ బిజెపిలో చేరాలని కోరుతున్నాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులకు బిజెపి వలవేస్తోంది.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలకు బిజెపి నేత భగవత్ ఖూబా ఫోన్లు చేసి మరీ బిజెపిలో చేరాలని కోరుతున్నాడు. ఎవరెవరికి ఫోన్లు వచ్చాయనే విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతర్గతంగా ఆరా తీసుకొంటున్నారు.

తెలంగాణలో అమిత్ షా ఈ నెల 22వ, తేది నుండి పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తారు. అయితే అమిత్ షా పర్యటన సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరిద్దరూ కీలకనేతలను తమ పార్టీలోకి జాయిన్ అయ్యేలా బిజెపి ప్లాన్ చేస్తోంది.

2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం బిజెపి ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులతో బిజెపి నాయకులు సంప్రదింపులు చేస్తున్నారు.

Bhagavanth Kumbha secret meetings with Telangana congress party leaders

ఈ మేరకు బిజెపి నాయకుడు భగవంత్ ఖూబా తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో చర్చిస్తున్నారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆయన ఫోన్లో చర్చలు జరిపారని సమాచారం.

బిజెపిలో చేరితే రాజకీయంగా భవిష్యత్ ఉంటుందని ఖూబా కాంగ్రెస్ నాయకులకు హమీలు కురిపిస్తున్నాడని సమాచారం. రాష్ట్రంలో రాజకీయపరిస్థితులు, కెసిఆర్ పాలనతో పాటు ఇతర పార్టీలపై తొలుత అభిప్రాయాలను తెలుసుకొంటారు.

అయితే రాష్ట్ర పర్యటనకు వస్తున్న అమిత్ షా ను కలవాలని ఖూబా కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుతున్నారని సమాచారం.అయితే ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు వెలిబుచ్చే సందేహాలను ఆయన తీరుస్తున్నారు. అయితే రాజకీయాల్లో ఒకే రకమైన అభిప్రాయాలతో ఉండకూడదని ఆయన చెబుతున్నారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

ఫోన్లో టచ్ లో ఉంటానంటూ ఆయన కాంగ్రెస్ నాయకులకు హామీలు ఇస్తున్నారని సమాచారం. అదే సమయంలో బిజెపిలో నాయకుల పరిస్తితి ఎలా ఉంటుందనే విషయమై కూడ ఆయన చర్చించారని తెలుస్తోంది.

English summary
Bhagavanth Kumbha secret meetings with Telangana congress party leaders for join in Bjp.he phoned some Congress leaders.Bjp planning to strengthen party in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X