వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒమర్ దిమ్మతిరిగే జవాబు, 12 గంటలపాటు ఇంటర్నెట్లోనే ఐసిస్ వ్యాప్తి

నాలుగేళ్ళ క్రితం వరకుక సుబ్రమణ్యంగా ఉన్న ఒమర్. గుజరాత్ వెళ్ళిన తర్వాత మత ఛాందసవాదిగా మారాడు. ఇంటర్నెట్ సహయంతో ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తిచెందే ప్రయత్నం చేశాడు.రోజూ 12 గంటలపాటు ఆయన ఇంటర్నెట్ లోనే ఐసిస్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నాలుగేళ్ళ క్రితం వరకుక సుబ్రమణ్యంగా ఉన్న ఒమర్. గుజరాత్ వెళ్ళిన తర్వాత మత ఛాందసవాదిగా మారాడు. ఇంటర్నెట్ సహయంతో ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తిచెందే ప్రయత్నం చేశాడు.రోజూ 12 గంటలపాటు ఆయన ఇంటర్నెట్ లోనే ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించేవాడని పోలీసులు గుర్తించారు.

కృష్ణా జిల్లాకు చెందిన సుబ్రమణ్యం నాలుగేళ్ళ క్రితం ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. ఇంటర్మీడియట్ చదువుతుండగానే తన ముస్లిం స్నేహితుల్ని చూసి ఆయన స్పూర్తిపొందాడు.పై నుండి వచ్చిన ఆదేశాల ఆధారంగానే తాను మతం మార్చుకొన్నట్టుగా ఒమర్ పోలీసు అధికారులకు చెప్పాడు.

ఒమర్ ను విచారించిన పోలీసులకు అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూసినట్టు చెబుతున్నారు. అయితే తన ఉనికిని ఎక్కడా బయటపకుండా ఒమర్ అనేక జాగ్రత్తలను తీసుకొన్నాడు.

విదేశాల్లోని ఉగ్రవాదులతో ఒమర్ నేరుగా సంబాషించేవాడు. విధ్వంస ప్రణాళికలను అమలుచేయాలని భావించేలోపుగానే పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

12 గంటలపాటు ఇంటర్నెట్ లోనే

12 గంటలపాటు ఇంటర్నెట్ లోనే

మతం మార్చుకొని ఐసిస్ భావజాల వ్యాప్తి కోసం పనిచేస్తోన్న ఒమర్ అలియాస్ సుబ్రమణ్యం రోజులో 12 గంటలపాటు ఇంటర్నెట్ లో గడిపేవాడు. రెండేళ్ళ నుండి పూర్తిస్థాయిలో ఆయన ఐసిస్ భావజాలవ్యాప్తికోసం ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. సామాజిక మాధ్యమాల్లో విధ్వేషాన్ని రెచ్చగొట్టేవాడని పోలీసులు గుర్తించారు.

పోలీసులకు దిమ్మతిరిగే జవాబిచ్చిన ఒమర్

పోలీసులకు దిమ్మతిరిగే జవాబిచ్చిన ఒమర్


ఉగ్రవాద కార్యకలాపాలు తప్పు కాదా అని విచారణలో ఓ అధికారి అడిగిన ప్రశ్నకు అతడు దిమ్మతిరిగే జవాబిచ్చాడు. మీరు పోలీసు విధులను నిర్వహించినట్టుగానే తాను కూడ ఐసిస్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు జవాబిచ్చాడని అధికారులు అంటున్నారు. ప్రపంచంపై యుద్దం చేద్దాం...దూకుడుగా వెళ్తే అడ్డే ఉండదంటూ సామాజిక మాథ్యమాల్లో బావోద్వేగాలను రెచ్చగొట్టేవాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు.

 వంటవాడిగా పనిచేస్తూ

వంటవాడిగా పనిచేస్తూ

తన అవసరాలను తీర్చుకొనేందుకుగాను ఒమర్ వంటవాడిగా పనిచేస్తున్నాడు. భోజనం, ఇంటర్నెట్ కోసం ఇతర అవసరాలకు డబ్బును సమకూర్చుకొనేందుకుగాను ఆయన టోలీచౌకీలోని పారమౌంట్ కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లో వంటవాడిగా పనిచేస్తున్నాడు. రెండుఏళ్ళలో సామాజిక మాథ్యమాల ద్వారా ఐదువేల మందితో ఒమర్ మాట్లాడారని పోలీసులు గుర్తించారు.

విధ్వంసం అమలు చేయాలని ప్లాన్

విధ్వంసం అమలు చేయాలని ప్లాన్


ఇంతకాలం పాటు ఐసిస్ భావజాల వ్యాప్తికోసం పనిచేసిన ఒమర్ ...విధ్వంసానికి ప్లాన్ చేశాడని విచారణాధికారులు గుర్తించారు.దీన్ని అమలు చేసేలోపుగానే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఇరాక్, దుబాయ్ లలో ఉన్న ఉగ్రవాదులతో ఒమర్ నేరుగా మాట్లాడేవాడని అధికారులు గుర్తించారు. ఒమర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నంలో చదువుకొన్నాడు.అయితే అతడితో సంబంధాలున్న ఇద్దరు యువకులను కూడ పోలీసులు విచారిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.అయితే ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించడం లేదు. ఒమర్ తండ్రి వెంకటనరసింహరావును కూడ పోలీసులు విచారించారు.

English summary
Hyderabad police arrested an alleged ISIS sympathiser from Tolichowki on Friday. Konakalla Subramanyam, alias Omer, a recent religious convert, allegedly chatted with ISIS sympathisers on social media networks. Hyderabad police allege that he wanted to carry out subversive activities in the country on the instigation of a person named Abu Qahafa Al-Hindi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X