వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ ఎఫెక్ట్: బీహార్ ఫార్మూలా, బద్దశత్రువుల కలయిక టిఆర్ఎస్ కు నష్టమేనా?

ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉండగానే తెలంగాణలో విపక్షాలు పొత్తులకు సన్నద్దమౌతున్నాయి. అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ను ఎదుర్కోనేందుకుగాను విపక్షాలు కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నాలను సాగిస్తున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైద్రాబాద్: ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉండగానే తెలంగాణలో విపక్షాలు పొత్తులకు సన్నద్దమౌతున్నాయి. అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ను ఎదుర్కోనేందుకుగాను విపక్షాలు కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నాలను సాగిస్తున్నాయి.ఈ మేరకు టిడిపితో కలిసిపనిచేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.మరోవైపు ఈ ప్రకటన అధికార పార్టీకి కలిసివచ్చే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. అయితే బీహార్ రాష్ట్రంలో అనుసరించిన ఫార్మూలాను తెలంగాణలో అమలు చేసేందుకు విపక్షాలు సన్నద్దమయ్యాయి.

2019 ఎన్నికలకు తెలంగాణలో విపక్షాలు ప్రణాళికలను సిద్దం చేస్తున్నాయి.అధికార పార్టీని ఢీకొట్టేందుకు ఇప్పటినుండే వ్యూహాలను సిద్దం చేస్తున్నాయి. పార్టీలు, సంస్థలు మధ్య పొత్తులపై చర్చలకు తెరతీశాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉన్నప్పటికీ అధికారపార్టీని ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయడం తప్పనిసరనే అభిప్రాయంతో ఆ పార్టీలున్నాయి.

రాష్ట్రంలో టిఆర్ఎస్ బలంగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనలేమనే అభిప్రాయంతో విపక్షాలు ఉన్నాయి.దీంతో విపక్షాల ఓటు బ్యాంకు చీలిపోకుండా ఉండేందుకుగాను ఆ పార్టీలు కూటమి లేదా పొత్తు ఏర్పాటుచేసుకోవాలని ఆలోచిస్తున్నాయి.

ఈ ప్రక్రియలో భాగంగానే బీహార్ తరహాలో మహాకూటమి ప్రయోగం మరోసారి తెలంగాణలో తెరమీదికివచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఈ తరహా కూటములు, లేదా పార్టీల మధ్య పొత్తులు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ,2019 నాటి ఎన్నికలకు ఎదుర్కొనేందుకు పార్టీలు ఇప్పటినుండే తమ కార్యాచరణను సిద్దం చేసుకొంటున్నాయి.

టిడిపితో కాంగ్రెస్ పార్టీ పొత్తు వెనుక కారణమేమిటీ?

టిడిపితో కాంగ్రెస్ పార్టీ పొత్తు వెనుక కారణమేమిటీ?

శత్రువుకు శత్రువు మిత్రుడనే నానుడిని తెలంగాణలో విపక్షాలు పాటిస్తున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ రాజకీయంగా ఇతర పార్టీలను బలహీననర్చింది.ఫిరాయింపులతో ఇతర పార్టీలు కుదేలయ్యాయి. ప్రధానంగా టిడిపి, కాంగ్రెస్ పార్టీలు బాగా బలహీనపడ్డాయి.ఈ తరుణంలో ప్రధాన శత్రువైన టిఆర్ఎస్ ను దెబ్బకొట్టేందుకుగాను టిడిపితో చేతులు కలిపేందుకు సిద్దమని కాంగ్రెస్ పార్టీ సంకేతాలను ఇచ్చింది.టిఆర్ఎస్ ను ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదనే అభిప్రాయంతోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్. జైపాల్ రెడ్డి టిడిపితో పొత్తుకు సిద్దమని ప్రకటించారు.టిఆర్ఎస్ ను గద్దెదించాలంటే ఇతర పార్టీలతో కలిసి పోటీచేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉంది.అయితే ఈ విషయాన్ని జైపాల్ రెడ్డి ప్రకటించారు.

బద్ద శత్రువులు ఎందుకు కలుస్తున్నాయంటే?

బద్ద శత్రువులు ఎందుకు కలుస్తున్నాయంటే?

కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పాటైన పార్టీ టిడిపి. అయితే తెలంగాణలో రాజకీయంగా ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి నెలకొంది. తెలంగాణలో టిడిపి నుండి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపిలలో 12 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు. క్షేత్రస్థాయిలో టిడిపి క్యాడర్ కూడ టిఆర్ఎస్ వైపు వెళ్ళింది. రాజకీయంగా టిడిపిని మరింత నష్టపర్చేందుకు టిఆర్ఎస్ అనుసరించిన వ్యూహం కలిసివచ్చింది. దీనికి తోడు మిత్రపక్షమైన బిజెపి కూడ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని ప్రకటించింది. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిసి పోటీచేశాయి. అయితే బలహీనపడిన టిడిపితో పొత్తు పెట్టుకోవడం కంటే ఒంటరిగా పోటీచేయడం వల్ల ప్రయోజనమని బిజెపి భావిస్తోంది. దీంతో టిడిపి కూడ రాజకీయంగా తమకు ప్రయోజనంగా ఉండే వ్యూహాన్ని తెరమీదికి తెచ్చింది. వచ్చే ఎన్నికల్లో టిఆర్ ఎస్ ను గద్దెదించేందుకుగాను కాంగ్రెస్ తో కలిసిపనిచేసేందుకు కూడ సిద్దమేనని ప్రకటించారు టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఈ ప్రకటన చేసిన రెండు రోజులకే జైపాల్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

టిఆర్ఎస్ కు లాభమేనా?

టిఆర్ఎస్ కు లాభమేనా?

టిఆర్ఎస్ ను ఒంటరిగా ఎదుర్కోలేమనే సంకేతాలను విపక్షాలు ఇచ్చాయి.ఈ పరిణామం రాజకీయగా టిఆర్ఎస్ కు కలిసిరానుందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా టిఆర్ఎస్ బలమైన పార్టీ అనే అభిప్రాయాన్ని తెలుపుతోందని సంకేతాలను కాంగ్రెస్ ఇచ్చింది.ఈ పరిణామం టిఆర్ఎస్ శ్రేణుల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపనుంది.మరో వైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని మరింత దెబ్బతీసేవిధంగా ఈ ప్రకటన లేకపోలేదు. అయితే టిడిపితో పొత్తు ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీకి చెందిన వి.హనుమంతరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి లాంటి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

టిఆర్ఎస్ కు మైనార్టీల ఓట్లు

టిఆర్ఎస్ కు మైనార్టీల ఓట్లు

ప్రస్తుతమున్న రాజకీయపరిస్థితులకు అనుగుణంగా వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి, టిడిపిలు కలిసి పోటీచేయనున్నాయి.అయితే తెలంగాణలో బిజెపి ఒంటరిగా పోటీచేసేందుకు ప్లాన్ చేసుకొంటుంది.అయితే టిడిపితో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం వల్ల మైనార్టీల ఓట్లు గంపగుత్తగా టిఆర్ఎస్ కు వెళ్ళే అవకాశం లేకపోలేదు.ముస్లింలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై బిజెపి జాతీయఅధ్యక్షుడు అమిత్ షా తో కెసిర్ కయ్యానికి కాలుదువ్వారు. ఏపీలో టిడిపితో బిజెపి పొత్తు పెట్టుకోవడం, తెలంగాణలో కాంగ్రెస్ తో టిడిపి కలిసి పోటీచేయడం వంటి పరిణామాలు మైనార్టీ ఓట్లను కాంగ్రెస్ కు దూరం చేసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

పార్టీల కూటములు?

పార్టీల కూటములు?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ విపక్షపార్టీలు కూటములుగా ఏర్పాటుకావడం, పార్టీల మధ్య పొత్తు పెట్టుకొని పోటీచేసిన చరిత్ర ఉంది. టిడిపి ఆవిర్భావం తర్వాత 1985 లో వామపక్షాలు, బిజెపిలు టిడిపితో కలిసి పోటీచేశాయి.అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బిజెపి టిడిపితో పొత్తును వీడింది. కానీ, వామపక్షాలు టిడిపితోనే కలిసి పోటీచేశాయి. 1989, 1994 ఎన్నికల్లో కూడ టిడిపి, వామపక్షాలు కలిసి పోటీచేశాయి. అయితే 1999 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు బిజెపితో పొత్తు పెట్టుకొన్నాడు. ఈ ఎన్నికల్లో వామపక్షాలు ఒంటరిగానే పోటీచేశాయి. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, టిఆర్ఎస్, వామపక్షాలు కలిసి పోటీచేశాయి.ఈ కూటమి రాష్ట్రంలో ఘన విజయం సాధించింది. 2009 ఎన్నికల్లో కూడ టిడిపి , వామపక్షాలు, టిఆర్ఎస్ మహాకూటమిని ఏర్పాటుచేసి పోటీచేశాయి.అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.

బీహార్ ఫార్మూలా ?

బీహార్ ఫార్మూలా ?

బీహార్ రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో తెలంగాణలో విపక్షాలు బీహార్ ఫార్మూలాను అనుసరించాలని నిర్ణయించాయి. టిడిపి, కాంగ్రెస్, సిపిఎం. సిపిఐ, జనసేన, కోదండరామ్, గద్దర్ లు కలిసి ఐక్యంగా పోటీచేసే అవకాశాలున్నాయి. అయితే సిపిఎం నేతృత్వంలో కూడ పార్టీ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి.అయితే ఈ ఫ్రంట్ లో కాంగ్రెస్ పార్టీ లేకుండా జాగ్రత్తలు తీసుకొంటామని సిపిఎం చెబుతోంది. అయితే రానున్న రోజుల్లో రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉండే అవకాశాలు లేకపోలేదు.విపక్షాల ఓటు బ్యాంకు చీలిపోతే అధికారపార్టీకి కలిసివచ్చే అవకాశం ఉన్నందున ఈ విషయంలో రానున్న రోజుల్లో విపక్షాల మధ్య ఐక్యత వచ్చే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

తెలంగాణ వ్యతిరేకశక్తుల ప్రచారం కూటమికి నష్టమేనా?

తెలంగాణ వ్యతిరేకశక్తుల ప్రచారం కూటమికి నష్టమేనా?

టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా టిడిపి, సిపిఎం, సిపిఐ , జనసేన కలిసి కూటమిగా ఏర్పాటైతే ఏ మేరకు ప్రయోజనం కలుగుతోందనే చర్చ కూడ లేకపోలేదు. తెలంగాణకు ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు కొంత సానుకూలత ఉంది.అయితే చివరివరకు తెలంగాణకు వ్యతిరేకించిన పార్టీగా సిపిఎం, టిడిపిలపై ముద్ర ఉంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై కూడ ఈ రకమైన ముద్ర లేకపోలేదు.దీంతో తెలంగాణ వ్యతిరేకశక్తులన్నీ కూటమిని ఏర్పాటుచేసి ఎన్నికల్లో పోటీచేస్తున్నాయని కెసిఆర్ ప్రచారం చేస్తే ఆ ప్రభావం ఈ కూటమి, లేదా ఈ పార్టీల పొత్తులపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు.అయితే ఈ రకమైన అభిప్రాయాలను విబేధించే వారు కూడ లేకపోలేదు.2004, 20009 ఎన్నికల్లో కూడ తెలంగాణకు కోరుకొనే టిఆర్ఎస్, వ్యతిరేకించే సిపిఎంలు ఒకే కూటమిలో ఉన్నాయి.ఈ విషయాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.

English summary
Oppositon parties will implement Bihar formula in Telangana state for 2109 elections. Congress, cpi, cpm, janasena and others will form a Mahakutami in Telangana. Bjp and Trs will contest seperatly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X