మాజీ ఎంపీ జంగారెడ్డికి తీవ్ర పరాభవం: చెంప చెళ్లుమనిపించిన వ్యాపారి(వీడియో)

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ జంగారెడ్డికి తన బంధువుల ఇంట్లో ఘోర పరాభవం ఎదురైంది. జంగారెడ్డి సోదరుడికి, ఓ క్రషర్ యజమానికి మధ్య ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో వారిద్దరి మధ్యా చర్చ జరుగుతోంది.

కాగా, వారి మధ్యలో వెళ్లిన జంగారెడ్డిపై దాడి జరిగింది. ఆయనపై దాడి చేసి, ఆ వీడియో రికార్డు చేయాలన్న ఉద్దేశంతో ముందే సీసీ కెమెరాలు అమర్చినట్టు తెలుస్తోంది. క్రషర్ యజమాని ఇంట రాజీ ప్రయత్నాలు జరుగుతుండగా.. మధ్యలో వెళ్లిన జంగారెడ్డి చెంపపై కొట్టాడు క్రషర్ యజమాని. కాగా, ఆ వీడియో ఇప్పుడువీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో 'నీ కాళ్లకు మొక్కుతా, తప్పయింది సార్' అని జంగారెడ్డి అనడం కనిపిస్తోంది. జంగారెడ్డి చివరికి చెంపలేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. క్రషర్ యజమానికి, జంగారెడ్డి సోదరుడికి మధ్య రూ. 6 లక్షల నగదు విషయమై గొడవ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

కాగా, అంతకుముందు ఇదే విషయంలో జంగారెడ్డి, సదరు యజమానిని కొట్టించాడని, అందుకు ప్రతిగానే ఈ దాడి జరిగిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే, ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
BJP former MP jangareddy slapped by businessman leaked mms.
Please Wait while comments are loading...