హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్విస్ట్: టెక్కీ సునీత హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టెక్కీ సునీత హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రేమిస్తున్నానంటూ గతంలో ఓ వ్యక్తి వేధించాడని తెలిసి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అందుకే అప్పటి నుంచి సునీత పెళ్లి కూడా చేసుకోలేదని ఆమె అన్నయ్య అంటున్నాడు. అనుమానంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

సునీతను ఎక్కడో చంపేసి ఆమె శవాన్ని హైటెక్ సిటీ ప్రాంతానికి తీసుకొచ్చి కాల్చేసిన విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆఫీసుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వచ్చిన టెక్కీ సునీత మధ్యాహ్నానికే మంటల్లో కాలిబూడిదైంది.

సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు మహిళ వివరాలు గుర్తించారు. హైటెక్ సిటీలో రోడ్డు పక్కన చెట్లపొదల్లో మనిషిని కాల్చేసిన విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.. అంతకుముందు నలుగురు యువకులు అటువైపు నుంచి రావడాన్ని సెక్యూరిటీ గమనించారు. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మంటల్లో ఉన్న ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే పూర్తిగా కాలిపోయింది.

సగం కాలిపోయిన పర్సులో...

సగం కాలిపోయిన పర్సులో...

సునీత మృతదేహంతో పాటు పర్సు సగం కాలిపోయింది. ఆ పర్సులో చార్జర్, సిమ్ కార్డు ఉండటంతో దాంట్లో ఉన్ననంబర్ల సహాయంతో మృతురాలి కుటుంబ సభ్యులకు, బంధువులకు సమాచారమందించారు. మృతి చెందిన మహిళను సికింద్రాబాద్ బైబిల్ హౌస్ ప్రాంతానికి చెందిన సునీతగా పోలీసులు నిర్ధారించారు.

 సిసిటీవీ ఫుటేజీ సీజ్

సిసిటీవీ ఫుటేజీ సీజ్

సెక్యూరిటీ సమాచారం మేరకు సీసీ కెమెరాల పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆమెను ఎక్కడో చంపేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకొచ్చి హైటెక్ సిటీలో కాల్చేశారని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఎక్కడా ఆధారాలు దొరక్కుండా కాల్చేశారు. పెట్రోలు పోసి సునీతను కాల్చేసినట్లుగా పక్కా ఆధారాలు పోలీసులకు లభిచాయి. పెట్రోలు పోసేటపుడు కూడా ఎక్కడా ఆనవాళ్లు దొరక్కుండా చేతికి గ్లౌస్‌‌లు ధరించినట్లు తెలుస్తోంది.

కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తోంది..

కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తోంది..

మృతి చెందిన సునీత అమీర్‌‌పేటలోని ఓ కాల్ సెంటర్లో పనిచేస్తోంది. రోజూ ఉదయం 9గంటలకు ఇంటినుంచి ఆఫీసుకెళ్లి రాత్రి పదికళ్లా విధులు ముగించుకుని ఇంటికి వచ్చేది. సునీత తల్లిదండ్రులు చనిపోవడంతో తన అన్నయ్య ఇంట్లోనే ఉంటోంది. సునీత అన్న,అక్కలిద్దరూ అదే ప్రాంతంలో నివసిస్తున్నారు.

రోజు మాదిరిగానే ఆఫీసుకు బయలుదేరింది..

రోజు మాదిరిగానే ఆఫీసుకు బయలుదేరింది..

రోజూ మాదిరిగానే బుధవారం ఉదయం ఆఫీసు అని చెప్పి వెళ్లిన సునీత అర్ధరాత్రి అవుతున్నా ఇంటికి రాకపోవడంతో ఆమె బంధువులు గాలించడం ప్రారంభించారు. ఇంతలో పోలీసుల్నుంచి ఫోన్ వచ్చింది. సునీత గురించి వివరాలడిగిన పోలీసులు చనిపోయినట్లు చెప్పారు.

English summary
he body of a 32-year-old Monster.com employee was found burnt in Madhapur. With the help of a SIM card found on the victim’s partially burnt handbag found at the spot, police identified her as Korapu Sunitha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X