హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇన్ఫోసిస్ ఉద్యోగి వద్ద బెదిరించి డబ్బులు తీసుకున్న నిందితుడు అరెస్ట్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సాప్ట్‌వేర్ ఉద్యోగిని బెదిరించి ఏటీఎంలో నుంచి డబ్బులు డ్రా చేయించుకుని ఉడాయించిన క్యాబ్ డ్రైవర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం జూబ్లిహిల్స్‌కు చెందిన కల్యాణ్ సత్యనారాయణ గచ్చిబౌలిలోని ఇన్పోసిస్ కంపెనీలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు.

జూన్ 23వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో విధులు ముగించుకుని కార్యాలయం నుంచి ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యలో ఖాజాగూడ చౌరస్తా వద్ద్ ఓ క్యాబ్ డ్రైవర్ అడ్డుకున్నాడు.

తనకు అడ్డు వచ్చాడని, దీంతో తాను గాయాలపాలయ్యానని గొడవకు దిగాడు. తనకు రూ. 10 వేల డబ్బులు ఇవ్వాలని, లేని పక్షంలో తన అన్నలు, స్నేహితులను పిలుస్తానని, వారి చేతిలో దెబ్బలు తినడం ఖాయమని బెదిరించాడు.

Cab driver arrested for robbing techie

దీంతో భయపడిన కల్యాణ్ సదరు క్యాబ్ డ్రైవర్‌కి షేక్ పేట్ నాలా వద్ద ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం నుంచి రూ. 8650 నగదును డ్రా చేసి ఇచ్చాడు. దీంతో అతను డబ్బులు తీసుకుని అక్కడ నుంచి ఉడాయించాడు.

అనంతరం కల్యాణ్ సదరు విషయమై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నార్సింగికి చెందిన క్యాబ్ డ్రైవర్ కలీల్ బాషాన నిందితుడిగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.

English summary
A cab driver was arrested by the Raidurgam police on Thursday for robbing an infosys employee a few days ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X