హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో ముఠాగా.. కోట్లలో అంతర్జాతీయస్థాయి మోసాలు: అరెస్ట్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో మరో ఘరానా కాల్ సెంటర్ మోసం వెలుగుచూసింది. ఇది అలాంటి ఇలాంటి మోసం కాదు. ఏకంగా హైదరాబాద్ నుంచే అమెరికా, బ్రిటన్ లాంటి పాశ్చాత్య దేశాల్లో కూడా కోట్ల రూపాయల్లో మోసాలకు పాల్పడ్డారు. ఈ ముఠాకు చెందిన 14 మంది నిందితులను దక్షిణ మండల పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి వెల్లడించిన వివరాలిలావున్నాయి. సౌత్ జోన్ పరిధిలోని రెయిన్ బజార్ గంగానగర్‌లో బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులను ఎస్‌ఐ గోవిందస్వామి ఆపారు.

తమ పేర్లు బెన్ హాప్కిన్స్, జాసన్ స్మిత్ అంటూ తటపటాయిస్తూ చెప్పడంతో అనుమానంతో వారివద్దనున్న ల్యాప్‌టాప్‌ను పరిశీలించారు. ఇందులో దేశ విదేశాలకు చెందిన టెలిఫోన్ నెంబర్లు, పలు బ్యాంకు ఖాతాల వివరాలు, స్థానికంగా నడిపిస్తున్న కాల్ సెంటర్ల నంబర్లు ఉన్నాయి.

నిందితులిచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌లో కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న గుజరాత్‌కు చెందిన ఇషాన్ పాఠక్, రాహుల్ బజాజ్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా పర్వాజ్ కాలింగ్ సల్యూషన్స్ (రెయిన్ బజార్), క్విక్ క్యాష్ లోన్స్ (టోలిచౌక్), ఎబి కాలింగ్ సొల్యూషన్స్ పంజాగుట్ట), క్యాష్ సేమ్ డే (టోలిచౌక్)లలో తమ కార్యాలయాలున్నాయని తెలిపారు.

నిందితుల అరెస్ట్

నిందితుల అరెస్ట్

హైదరాబాద్ నగరంలో మరో ఘరానా కాల్ సెంటర్ మోసం వెలుగుచూసింది. అలాంటి ఇలాంటి మోసం కాదు. ఏకంగా హైదరాబాద్ నుంచే అమెరికా, బ్రిటన్ లాంటి పాశ్చాత్య దేశాల్లో కూడా కోట్ల రూపాయల్లో మోసాలకు పాల్పడ్డారు.

నిందితుల అరెస్ట్

నిందితుల అరెస్ట్

ఈ ముఠాకు చెందిన 14 మంది నిందితులను దక్షిణ మండల పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

నిందితుల అరెస్ట్

నిందితుల అరెస్ట్

ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి వెల్లడించిన వివరాలిలావున్నాయి.

నిందితుల అరెస్ట్

నిందితుల అరెస్ట్


సౌత్ జోన్ పరిధిలోని రెయిన్ బజార్ గంగానగర్‌లో బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులను ఎస్‌ఐ గోవిందస్వామి ఆపారు.

నిందితుల అరెస్ట్

నిందితుల అరెస్ట్

తమ పేర్లు బెన్ హాప్కిన్స్, జాసన్ స్మిత్ అంటూ తటపటాయిస్తూ చెప్పడంతో అనుమానంతో వారివద్దనున్న ల్యాప్‌టాప్‌ను పరిశీలించారు.

నిందితుల అరెస్ట్

నిందితుల అరెస్ట్

ఇందులో దేశ విదేశాలకు చెందిన టెలిఫోన్ నెంబర్లు, పలు బ్యాంకు ఖాతాల వివరాలు, స్థానికంగా నడిపిస్తున్న కాల్ సెంటర్ల నంబర్లు ఉన్నాయి.

నిందితుల అరెస్ట్

నిందితుల అరెస్ట్

నిందితులిచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌లో కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న గుజరాత్‌కు చెందిన ఇషాన్ పాఠక్, రాహుల్ బజాజ్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా పర్వాజ్ కాలింగ్ సల్యూషన్స్ (రెయిన్ బజార్), క్విక్ క్యాష్ లోన్స్ (టోలిచౌక్), ఎబి కాలింగ్ సొల్యూషన్స్ (పంజాగుట్ట), క్యాష్ సేమ్ డే (టోలిచౌక్)లలో తమ కార్యాలయాలున్నాయని తెలిపారు.

దీంతో ఆ కార్యాలయాలలో తనిఖీలు చేపట్టగా 14మంది యువకులు తమ పేర్లను మార్చుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు తేలింది. కాల్ సెంటర్ల నుంచి అమెరికా, బ్రిటన్, ఇండోనేసియా దేశాలకు చెందిన బ్యాంక్ డేటాలను, అదేవిధంగా నిరుద్యోగులు, సంపన్నులకు చెందిన ఖాతాల వివరాలనూ సేకరిస్తారు.

వివిధ బ్యాంకుల్లో రుణ ప్రయత్నం చేసి విఫలమైన వ్యాపారులకు ఫోన్ చేసి మీకు లోన్ మంజూరైందని, కొంత మొత్తాన్ని ఫలానా అకౌంట్‌లో జమ చేయాలని చెబుతారు. దీంతో వారు జమ చేసిన మొత్తాన్ని ఇషాన్ పాఠక్, రాహుల్ బజాజ్‌లు తమ ఖాతా నుంచి 4శాతం కమిషన్ తీసుకొని మిగతా సొమ్మును మిగిలిన నిందితులకు ఇస్తారు.

నిందితులు 2012లో మొదలు పెట్టిన ఈ దందాలో ఇప్పటివరకు రూ. 1.50కోట్లు ఒక్క అమెరికా నుంచే రాబట్టినట్టు కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా మనీ ప్రైజ్ పేరుతోనూ, విదేశాల్లో ఉద్యోగాలిస్తామంటూ మోసానికి పాల్పడుతున్నారు.

14మంది నేరస్థులను అరెస్టు చేశామని మరో నలుగురు పరారీలో ఉన్నారన్నారు. వీరిపై పిడి యాక్టు నమోదు చేశామన్నారు. ఈ సందర్భంగా సైబర్ నేరస్థులను పట్టుకున్న సౌత్‌జోన్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రెయిన్ బజార్ ఇన్స్‌పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్‌ఐలు సంతోష్‌కుమార్, శ్రీశైలం, గోవిందస్వామిలను కమిషనర్ మహేందర్ రెడ్డి ప్రశంసించారు.

English summary
The Hyderabad police on Thursday arrested 14 people, all residents of the Old City, and claimed to have busted an international racket of swindling money from foreigners.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X