హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీకే ఎక్కువిస్తాం: కేసీఆర్‌తో కెనెడా కంపెనీ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతె కెనడాకు చెందిన ఫెయిర్ ఫాక్స్ ప్రతినిధులు మంగళవారం నాడు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ప్రపంచంలో పలు సంస్థలు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని కేసీఆర్ అన్నారు. సంస్థలకు తాము సహకరిస్తామన్నారు.

ఫెయిర్ ఫాక్స్ సంస్థ చైర్మన్ ప్రేమ్ వాత్స, ఎండీ మాధవన్ మీనన్, డైరెక్టర్ అథప్పన్, వినోద్, లీ సంస్థ ఎండీ ఫణిరాజ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింహ రావు తదితరులు భేటీలో పాల్గొన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

ప్రేమ్ వాత్స ముఖ్యమంత్రితో మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలలో పేరొందిన తమ సంస్థ భారత దేశంలో వివిధ రంగాలలో బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోందని, ఎక్కువ నిధులను తెలంగాణకు కేటాయిస్తామన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుమంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ప్రేమ్ శ్రీవాత్స చెప్పారు.

కేసీఆర్

కేసీఆర్

ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనే అంశంపై వారు ముఖ్యమంత్రితో చర్చించారు. కేసీఆర్ మాట్లాడుతూ.. పెట్టుబడులకు తెలంగాణలో రహదారులు, రక్షిత నీటి సరఫరా, విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

హైదరాబాదులో ట్రాఫిక్ సమస్యల నివారణకు ఆకాశ మార్గాలు, రహదారుల సపరేటర్లను నిర్మిస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు.

English summary
CANADA INDUSTRIALISTS MET Telangana CM K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X