నిశిత్ ప్రమాదం స్థలంలోనే మళ్లీ: యువతి కారు బీభత్సం, పరారైంది

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్, అతని స్నేహితుడు రవిచంద్ర ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచిన ఘటన మరువక ముందే ఆ ప్రాంతం(జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 26)లోనే మరోసారి ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో రాంగ్ రూట్‌లో వచ్చిన ఓ యువతి తన బీఎండబ్ల్యూ మినీ కారుతో టాటా సఫారీని ఢీకొట్టింది.

మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న బెంజ్ కారు: ఏపీ మంత్రి నారాయణ కుమారుడు మృతి

ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బ్యాగ్‌లు తెరచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న సదరు యువతికి ప్రాణాపాయం తప్పింది. శనివారం తెల్లవారుజామున 4.30గంటలకు ఈ ఘటన కావూరి హిల్స్ వద్ద చోటు చేసుకుంది.

car accident: girl escapes from the spot

కాగా, ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసిన యువతి అక్కడ్నుంచి పరారైంది. ఈ ప్రమాదంలో టాటా సఫారీ ముందు భాగం కొంత దెబ్బతింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. యువతి ఆచూకీ కోసం సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

English summary
A girl escaped from the car accident, on Saturday in Hyderabad.
Please Wait while comments are loading...