ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా: ఎసిబికి సండ్ర మరో లేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు కేసును విచారిస్తున్న తెలగాణ ఎసిబికి ఖమ్మం జిల్లా శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య మరో లేఖ రాశారు. తాను విచారణకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని ఆయన ఆ లేఖలో ఎసిబికి తెలియజేశారు. గతంలో ఎసిబి ఇచ్చిన నోటీసుకు సమాధానంగా తన ఆరోగ్యం బాగా లేనందున విచారణకు రాలేనని తెలియజేస్తూ లేఖ రాశారు.

విచారణకు హాజరు కావడానికి ఆయన అప్పుడు పది రోజుల గడువు అడిగారు. ఆ పది రోజుల గడువు ఎప్పుడో ముగిసింది. అయినా ఆయన విచారణకు హాజరు కాలేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. నోటుకు ఓటు కేసులో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఆయన బుధవారంనాడు ఎసిబికి లేఖ రాసినట్లు తెలుస్తోంది.

Sandra Venkta Veeraiah

తాను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాయని, విచారణకు అందుబాటులో ఉంటానని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని ఆ లేఖలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సండ్ర వెంకట వీరయ్య ఎక్కడున్నాడనే విషయంపై గొత కొద్ది రోజులుగా విభిన్నమైన కథనలాు వస్తున్నాయి.

నోటుకు ఓటు కేసులో ఎసిబి రేవంత్ రెడ్డి సహా ఉదయ్ సింహ, సెబాస్టియన్‌లను అరెస్టు చేసింది. నాలుగో నిందితుడు మత్తయ్య ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఉన్నారు. దీంతో ఆయనన ఆరెస్టు చేయడానికి ఎసిబికి వీలు చిక్కడం లేదు.

English summary
Telugudesam party Telangana MLA sandra Venkata Veeraih has written another letter to Telangana ACB saying his availibilt to question him in cash for vote case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X