వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్ బుక్ తో పరిచయాలతో డబ్బులు వసూలు చేసే మాయాలేడీ అరెస్టు

ఫేస్ బుక్ పరిచయాలతో అమాయకులను మోసగిస్తున్న ఓ మాయాలేడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. మాటలతో బురిడీ కొట్టించి డబ్బులను వసూలు చేయడమే వృత్తిగా పెట్టుకొన్న వినమ్రత అనే మాయలేడిని పోలీసులు బుదవారం

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫేస్ బుక్ పరిచయాలతో అమాయకులను మోసగిస్తున్న ఓ మాయాలేడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. మాటలతో బురిడీ కొట్టించి డబ్బులను వసూలు చేయడమే వృత్తిగా పెట్టుకొన్న వినమ్రత అనే మాయలేడిని పోలీసులు బుదవారం నాడు అరెస్టు చేశారు.

హైద్రాబాద్ లోని పలు హోటల్స్ లో విన్రమత రిసెప్షనిస్లుగా పనిచేస్తూ మాదాపూరో లో నివాసం ఉంటోంది. వేర్వేరు పేర్లతో ఆమె నకిలీ ఫేస్ బుక్ ఖాతాలను తెరిచింది.

CCS police arrested Vinamrata for cheating in Hyderabad

మాయమాటలతో అవతలివారిని ఇట్టే ఆకట్టుకొంది ఈ మాయలేడి. పరిచయమైన వారికి గోవాలో హోటల్ రూమ్స్ బుక్ చేస్తానంటూ డబ్బులు వసూలు చేసి తన బ్యాంకు ఖాతాలో డబ్బులను జమ చేయించేది.

ఈ రకంగా ఆమె చాలామందిని మోసం చేసింది. మూసాబౌలికి చెందిన శుభంగుప్తాకు వినమ్రత గోమ్స్ పేరుతో ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది.గోవాలో ఉంటున్నానని ఆమె చెప్పడంతో ఏప్రిల్ లో అక్కడకు టూర్ కు వస్తున్నానని అతను చెప్పాడు.

గోవాలో తనకున్న పరిచయాలతో తక్కువ ధరకు హోటల్ లో రూమ్ ఇప్పిస్తానంటూ అతడిని నమ్మించింది. ఆన్ లైన్ ద్వారా మూడు దఫాలుగా రూ.21 వేలు బ్యాంకు ఖాతాల్లో జమచేయించుకొంది. బాధితుడు హోటల్ బుకింగ్ గురించి మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది.

ఫేస్ బుక్ ఖాతా కూడ రద్దు చేసుకోవడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దర్యాప్తు ప్రారంభించి వినమ్రత బ్యాంకు ఖాతా, ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితురాలిని గుర్తించారు. ఆమె నగరంలోని ఓ హోటల్ లో పనిచేస్తున్నట్టు తేల్చారు.

ఫేస్ బుక్ పరిచయాలతో అమాయకులను మోసగించినట్టు నిర్ధారించారు.మాదాపూర్ లో శరత్ అనే యువకుడి కెమెరాను అతడికి తెలియకుండానే అమ్మి సొమ్ము చేసుకొంది. నిందితురాలిని పోలీసులు బుధవారం నాడు అరెస్టు చేశారు.నిందితురాలి నుండి రెండు మొబైల్ ఫోన్లు మూడు వేల రూపాయాలను స్వాధీనం చేసుకొన్నట్టు సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు.

English summary
CCS police arrested Vinamrata for cheating in Hyderabad on Wednesday.She created fake face book accounts for cheating. Shubhamgupta complaint against her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X