వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటీ కట్టలేదని నిధులు తరలిస్తారా, కేంద్రాన్ని చీల్చి చెండాడుతాం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్రం పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తెలంగాణను కేంద్రం చిన్న చూపు చూస్తోందని, తమకు ఇచ్చే నిధుల్లో కోతలు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆచితూచి వెళ్లాలన్నదే తమ లక్ష్యమన్నారు.

హక్కులకు భంగం కలిగితే పోరాటమే అన్నారు. ఐటీ కట్టలేదని నిధులు అన్న తరలిస్తారా అని మండిపడ్డారు. వెనక్కి ఇస్తామని ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులకు కేంద్ర ప్రభుత్వం భారీగా కోతపెడుతున్నదని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ విమర్శించారు.

14వ ఆర్థిక సంఘం కింద కేటాయింపులు పెరిగాయనే సాకుతో అంతకు రెట్టింపు స్థాయిలో వివిధ పథకాలకు కోత పెట్టిందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు మొదలుకుని చివరికి గర్భిణీస్త్రీల పౌష్టికాహారం దాకా అనేక పథకాలకు నిధులను తగ్గించిందన్నారు.

ఈటెల

ఈటెల

కేంద్రం నిధులు ఇవ్వనంత మాత్రాన రాష్ట్రంలోని సంక్షేమ పథకాల అమలుకు ఎలాంటి ఢోకా ఉండబోదన్నారు.ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలకు పుష్కలంగా నిధులు ఉన్నాయన్నారు.

ఈటెల

ఈటెల

బడ్జెట్ కేటాయింపులకు మించి నిధులు విడుదల చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం మానవీయకోణంలో వ్యవహరిస్తుందని, సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో రాజీ పడబోదన్నారు.

ఈటెల

ఈటెల

నిధుల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి ఎలా ఉన్నా ప్రస్తుతం తాము కేంద్రంతో ఆచితూచి వ్యవహరిస్తున్నామని ఈటెల చెప్పారు.

ఈటెల

ఈటెల

కేంద్ర ప్రభుత్వం ఎందుకిలా చేస్తుందో అర్థం కావడంలేదు. వారికి సంక్షేమం పట్టదా? అని మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈటెల

ఈటెల

రాష్ట్ర విభజన క్రమంలో సెక్షన్ 94(2) కింద డెవలప్‌మెంట్ ప్యాకేజీలో రూ.31వేల కోట్లు ఇవ్వాలని ఉన్నా, ఇంతవరకు పైసా ఇవ్వకపోగా దుర్మార్గంగా, అడ్డదారిలో టీఎస్‌బీసీఎల్ ఆదాయపు పన్ను బకాయిల పేరిట రూ.1290కోట్లను ఆర్‌బీఐ నుంచి తీసుకుందన్నారు.

ఈటెల

ఈటెల

అయినా కేంద్రంతో సంయమనం పాటిస్తూ ఆచితూచి వ్యవహరిస్తున్నామని, తాము ఎప్పుడు తెలంగాణ ప్రజల పక్షమేనని, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తే మాత్రం చీల్చిచెండాడేందుకు వెనుకాడమన్నారు. తాము పథకాల కోసం ఎంత ఖర్చు చేస్తున్నా మీడియాలో వ్యతిరేకవార్తలు రావడం బాధాకరమని ఈటెల అన్నారు.

ఈటెల

ఈటెల

కేవలం వ్యతిరేకభావం కాకుండా సానుకూల దృక్పథంతో ఆలోచించి మంచిపనులను గుర్తించాలని కోరారు. ఏ ప్రభుత్వమైనా ఏడాదికి 10శాతం అంచనాలు పెంచుకుంటుంది కానీ తమ ప్రభుత్వం 15నుంచి 17శాతం అంచనాలను పెంచిందని. దానిలో ఇప్పటికే 93శాతం సాఫల్యతను సాధించిందన్నారు.

ఈటెల

ఈటెల

నిధుల సమీకరణ కోసం చీప్ లిక్కర్‌పై ఆధారపడాల్సినంత చిల్లర ప్రభుత్వం తమది కాదని ఒక ప్రశ్నకు జవాబుగా ఆయన స్పష్టం చేశారు.

English summary
The state government would not hesitate to take on the Centre if the need arises especially if state interests were affected, finance minister Etela Rajender said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X