వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీధికుక్కలను తరిమికొట్టి హీరోగా మారిన బుడ్డోడు

హైద్రాబాద్ రోడ్లపై వీధికుక్కలతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయితే అర్దరాత్రి పూట ఓ చిన్నపిల్లవాడు ధైర్యంగా కుక్కలను ఎదుర్కొన్నాడు. తన చెల్లెలితో పాటు తాను సురక్షితంగా ఇంటికి చేరుకొన్నాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైద్రాబాద్ రోడ్లపై వీధికుక్కలతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయితే అర్దరాత్రి పూట ఓ చిన్నపిల్లవాడు ధైర్యంగా కుక్కలను ఎదుర్కొన్నాడు. తన చెల్లెలితో పాటు తాను సురక్షితంగా ఇంటికి చేరుకొన్నాడు.ఈ వీడియో సీసీటీవి కెమెరాల్లో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

నాలుగైదు కుక్కలు వెంటాడితే పెద్దవాళ్ళే భయపడతారు. అలాంటి చిన్నపిల్లాడు ఆ కుక్కలను వీరోచితంగా ఎదుర్కొన్నాడు. కుక్కలను చూసి పారిపోయిన చెల్లెని సురక్షితంగా తీసుకెళ్ళాడు.

chand became a hero after fights with dogs

హైద్రాబాద్ మూసాపేటలోని ఆంజనేయనగర్ కాలనీలో శనివారం రాత్రిపూట ఈ ఘటన చోటుచేసుకొంది. వీధి కుక్కలను ధైర్యంగా చిన్నపిల్లాడు ఎదుర్కొన్న దృశ్యాలు సీసీటీవి కెమెరాల్లో రికార్డయ్యాయి.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీధికుక్కలను ధైర్యంగా ఎదుర్కొన్న చందు సాహాసాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.శ్రీకాకుళం జల్లా ఇచ్చాపురానికి చెందిన కృష్ణ కొడుకు చందు. మూసాపేటలోని శ్రీకాకుళం బస్తీలో కృష్ణ నివాసం ఉంటున్నాడు.

మూసాపేటలోని శ్రీకాకుళం బస్తీలో శనివారం రాత్రి ఓ పెళ్ళి జరిగింది. ఈ సమయంలో తన చెల్లి కూతురు పూజతో కలిసి చందు వెళ్తుండగా వీధికుక్కలు వెంటపడ్డాయని చందు తండ్రి కృష్ణ చెప్పాడు.

తమ ఇంటికి సమీపంలోని చిన్న వీధిలో పూజ -చందులు కలిసి వెళ్తుండగా ఓ వీధికుక్కల గుంపు చుట్టుముట్టిందని, వాటిని ధైర్యంగా తరిమేసి చందు సురక్షితంగా బయటపడ్డాడని కృష్ణ చెప్పాడు.

వీధికుక్కలను ధైర్యంగా ఎదిరించి సురక్షితంగా బయటపడిన చందు ఉదంతం వెలుగుచూసిన తర్వాత జీహెచ్ ఎంసి అధికారులు రంగంలో దిగారు. వీది కుక్కలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

English summary
Chand became a hero after fighting with street dogs in Moosapeta on Saturday night.chand and his sister going to home, all of sudden street dogs try to attack on them, Chand fight with street dogs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X