వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘దోమ సోషలిస్టు’: కెసిఆర్ చెప్పిన కథ, బాలాజీ దర్శనం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం' వారోత్సవాలను శుక్రవారం రంగారెడ్డి జిల్లా చిలుకూరు వేంకటేశ్వర స్వామి దేవస్థానం సముదాయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంపంగి మొక్క నాటి హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పచ్చదనం లేని కారణంగానే వర్షాలు లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, బంగారు తెలంగాణ సాధించాలంటే ముందుగా మొక్కలను నాటి రాష్టమ్రంతా పచ్చదనంతో నింపివేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ దోమ కథ చెప్పారు. అది సోషలిస్టు అని.. దానికి మంత్రి, ముఖ్యమంత్రి అనే తేడాలుండవని చెప్పారు. ఆయన చెప్పిన కథ ఇలావుంది. ‘దోమకు తారతమ్య భేదాలుండవు. ఒకరిని కుట్టాలె... ఇంకొకరిని కుట్టకూడదన్న భేదభావం దానికి ఉండదు. సామాన్యులను కుడుతుంది... ఎమ్మెల్యేలను కుడుతుంది... మంత్రులను కుడుతుంది...చివరకు ముఖ్యమంత్రినైనా కుడుతుంది.. దోమ ఒక సోషలిస్టు.. మనలో ఎవరినైనా కుడుతుంద'ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చమత్కరించారు.

పరిశుభ్రత గురించి మాట్లాడుతూ కెసిఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు సభలో నవ్వులు కురిపించాయి. వనాల పెంపకం, పరిసర ప్రాంతాల పరిశుభ్రతపై శ్రద్ధ లేకుంటే ఏ పరిస్థితులకు దారితీస్తుందో చెబుతూ సూరత్‌ను ఒకప్పుడు ప్లేగు వ్యాధి కబళించిన వైనాన్ని సోదాహరణంగా చెప్పారు. అదే సందర్భంలో దోమల వల్ల వ్యాధులు ఎలా ప్రబలుతాయో వివరిస్తూ ‘దోమ-సోషలిస్ట్' కథ చెప్పారు.

‘సూరత్ వజ్రాల వ్యాపారానికి పేరు గాంచింది. అక్కడ వందలకోట్లు సంపాదించిన వారున్నారు. సంపాదన పైనే తప్ప పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించలేదు. చెత్తా చెదారంతో నిండిపోయిన సూరత్‌లో ఒక్కసారిగా విష రోగాలు ప్రబలి వేల సంఖ్యలో జనం చనిపోయారు. సంపాదించిన కోట్లాది విలువైన ఆస్తులను వదిలేసిన సంపన్న వర్గాలు వలసలు వెళ్ళారు.' అని చెప్పారు.

‘ఏం లాభం... అక్కడ ఎఎస్ రావు అనే ఐఎఎస్ అధికారి ఈ విషయంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి కోట్ల రూపాయలున్నా ఎందుకు పనికొస్తాయో క్షుణ్ణంగా వివరించి వారిలో మార్పును తీసుకొని వచ్చారు. అక్కడ పరిస్థితులు చక్కబడ్డాక వలస వెళ్లిన వారు తిరిగి వచ్చారు. ఇలాంటి వ్యాధులకు దోమలే కారణం. పరిశుభ్రత పాటించక పోవడంవల్లే అనర్థాలు చోటుచేసుకుంటాయంటూ' సుదీర్ఘంగా వివరించారు.

సిఎం కెసిఆర్ ఫ్యామిలీ

సిఎం కెసిఆర్ ఫ్యామిలీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరిత' వారోత్సవాలను శుక్రవారం రంగారెడ్డి జిల్లా చిలుకూరు వేంకటేశ్వర స్వామి దేవస్థానం సముదాయంలో ముఖ్యమంత్రి కేసిఆర్ సంపంగి మొక్క నాటి హరిత హారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

సిఎం కెసిఆర్

సిఎం కెసిఆర్

పచ్చదనం లేని కారణంగానే వర్షాలు లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, బంగారు తెలంగాణ సాధించాలంటే ముందుగా మొక్కలను నాటి రాష్టమ్రంతా పచ్చదనంతో నింపివేయాలని ఆయన పిలుపునిచ్చారు.

బాలాజీ ఆలయంలో..

బాలాజీ ఆలయంలో..

హరిత హారం కార్యక్రమం ఒక యజ్ఞమని, అదే తరహాలో దీనిని పరిగణించాలని ఆయన సూచించారు.

సిఎం కెసిఆర్

సిఎం కెసిఆర్

అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గం పరిధిలో 40 లక్షల మొక్కల చొప్పున నాలుగేళ్లపాటు నాటి వాటిని సంరక్షించి పెంచితే బంగారు తెలంగాణ సాధించుకునేందుకు అన్ని వనరులు సమకూరుతాయని ఆయన అన్నారు.

సిఎం కెసిఆర్

సిఎం కెసిఆర్

ఎన్ని కోట్లు సంపాదించినా లెక్కలోనికి రావని అంటూ గతంలో సూరత్‌లో జరిగిన సంఘటన ఆయన గుర్తు చేశారు.

సిఎం కెసిఆర్

సిఎం కెసిఆర్

పూర్వం హైదరాబాద్‌లో ఒక సామెత ఉండేదని ‘‘వికారాబాద్ హవా - లాకోం మరీజోంకా దవా'' అనేవారని, ప్రస్తుతం దానికి భిన్నంగా పరిస్థితులు మారి అడవులన్నీ అంతరించి పోవడంతో వాతావరణంలో మార్పులు వచ్చి విష వ్యాధులకు గురవుతున్నామని ఆయన అన్నారు.

సిఎం కెసిఆర్

సిఎం కెసిఆర్

గ్రామాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉండటానికి కూడా అంతరించిపోతున్న అడవులే కారణమని, ఈ సమస్యలన్నింటికి ఏకైక మార్గం హరిత హారం కార్యక్రమంలో భాగస్వాములై స్వచ్ఛందంగా ప్రతి ఒక్క రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే రెండేళ్లలో కరువును తరిమి కొడతామని ఆయన అన్నారు.

సిఎం కెసిఆర్

సిఎం కెసిఆర్

మొక్కలను నాటే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమమని భావించరాదని, ఇది ప్రజా కార్యక్రమమని ఆయన అన్నారు.

సిఎం కెసిఆర్

మొక్కలను నాటే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమమని భావించరాదని, ఇది ప్రజా కార్యక్రమమని ఆయన అన్నారు.

English summary
Telangna CM KCR launches Harita Haram at Chilkuri Balaji Temple, in Ranga Reddy district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X