వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధర్మారెడ్డి పేరు తీసేసి కెపిహెచ్‌బి పేరు పెట్టారు: 'సమైక్య'పై కేసీఆర్

బద్వేల్ మండలంలో రాజాబహదూర్ వెంకటరామారెడ్డి హాస్టల్ భవన నిర్మాణ సముదాయానికి సీఎంకేసీఆర్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బద్వేల్ మండలంలో రాజాబహదూర్ వెంకటరామారెడ్డి హాస్టల్ భవన నిర్మాణ సముదాయానికి సీఎంకేసీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

రాజా బహదూర్ స్థాపించిన సంస్థకు నేను ఇచ్చింది చంద్రునికో నూలు పోగు వంటిదే అన్నారు. ఇప్పుడు ఇచ్చిన పది ఎకరాలకు తోడు మరో ఐదు ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.

సమైక్య రాష్ట్రంలో మహానుభావుల పేర్లు కనుమరుగు

సమైక్య రాష్ట్రంలో మహానుభావుల పేర్లు కనుమరుగు

సమైక్య రాష్ట్రంలో మహానుభావుల పేర్లు కనుమరుగయ్యాయని చెప్పారు. అంబేడ్కర్ కంటే ముందు దళితుల కోసం పోట్లాడిన వ్యక్తి భాగ్యారెడ్డి వర్మ అన్నారు. అగ్రికల్చరల్ విశ్వవిద్యాలయానికి జయశంకర్ పేరు పెట్టుకున్నామన్నారు.

ధర్మారెడ్డి పేరును కెపిహెచ్‌బిగా

ధర్మారెడ్డి పేరును కెపిహెచ్‌బిగా

గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ధర్మారెడ్డి కెపిహెచ్‌బి కాలనీని కడితే, ధర్మారెడ్డి కాలనీ పేరును తీసేసి, కెపిహెచ్‌బి అని పేరు పెట్టుకున్నారని సమైక్య పాలనపై కెసిఆర్ మండిపడ్డారు. ఉద్యమం సమయంలో మళ్లీ ధర్మారెడ్డి పేరు పెట్టుకున్నామన్నారు.

రెడ్డి హాస్టల్లో చదివిన వారు గొప్ప స్థానాల్లో

రెడ్డి హాస్టల్లో చదివిన వారు గొప్ప స్థానాల్లో

కనుమరుగైన మన వాళ్ల పేర్లు పునరుద్ధరించుకోవాలన్నారు. రెడ్డి హాస్టల్లో చదివిన వారు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారన్నారు. ఇక్కడి విద్యార్థులు ప్రధానిగా కూడా అయ్యారన్నారు. రెడ్డి హాస్టల్లో ఇతర విద్యార్థులకు కూడా అవకాశం ఇచ్చారన్నారు.

పుట్టుకతో శ్రీమంతుడు

పుట్టుకతో శ్రీమంతుడు

రాజా బహదూర్ వెంకట రామారెడ్డి పుట్టుకతో శ్రీమంతుడు అన్నారు. ఆయన అంచెలంచెలుగా ఎదిగి కోత్వాల్ అయ్యారన్నారు. కొత్వాల్ అంటే ఇప్పుడు డిజిపితో సమానమని అన్నారు. ఎస్సై స్థాయి నుంచి ఆ స్థాయికి ఎదిగారన్నారు. ఆయన 14 సంస్థలను స్థాపించారన్నారు. విద్యాతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. బల్దియాలో దళితులకు రిజర్వేషన్లు కల్పించిన మహానుభావుడు అన్నారు.

English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao on Tuesday lay foundation for New Reddy hostel in Ranga Reddy district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X