హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నుమాయిష్‌లో కొలువుదీరిన స్టాళ్లు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) స్థలాన్ని ఢిల్లీలోని ప్రగతి మైదానం కంటే అపురూపంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రతి యేటా నుమాయిష్ నిర్వహిస్తూ దేశ, విదేశాలకు చెందిన ఉత్పత్తులకు నగరాన్ని వేదిక చేయటంతో పాటు ప్రతిష్టాత్మకమైన ఎన్నో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీ సేవలను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రశంసించారు.

75వ అఖిల భారత నుమాయష్ ప్రదర్శనను ఆయన గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిస్వార్థంగా, సమాజ సేవ చేస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీకి నిజాం స్థలం ఇస్తే దాన్ని ప్రభుత్వాలు లీజుకివ్వడం సిగ్గు చేటని అన్నారు. సోషల్ కాజ్‌ కోసం పని చేస్తున్న సొసైటీకే ఈ స్థలాన్ని నాలుగు రోజుల్లో పట్టా ఇచ్చేస్తామని చెప్పారు. ఇక సొసైటీ లెస్సీ, కాదు పట్టాహోల్డర్ అని సిఎం కెసిఆర్ భరోసా ఇచ్చారు.

అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్ సొసైటీ తెలంగాణ విద్యార్థులకు విద్యనందిస్తుందన్నారు. అనాధపిల్లలకు ఎగ్జిబిషన్ సొసైటీ రూ. 4 కోట్లతో స్కూల్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపి కె. కేశవరావు, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న మంత్రి ఈటెల

ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న మంత్రి ఈటెల

అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) స్థలాన్ని ఢిల్లీలోని ప్రగతి మైదానం కంటే అపురూపంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు.

నుమాయిష్

నుమాయిష్

ప్రతి యేటా నుమాయిష్ నిర్వహిస్తూ దేశ, విదేశాలకు చెందిన ఉత్పత్తులకు నగరాన్ని వేదిక చేయటంతో పాటు ప్రతిష్టాత్మకమైన ఎన్నో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీ సేవలను తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రశంసించారు.

నుమాయిష్

నుమాయిష్

75వ అఖిల భారత నుమాయష్ ప్రదర్శనను ఆయన గురువారం సాయంత్రం ప్రారంభించారు.

నుమాయిష్

నుమాయిష్

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ఎగ్జిబిషన్ స్థలాన్ని లీజులకు ఇవ్వడాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. నిస్వార్థంగా, సమాజ సేవ చేస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీకి నిజాం స్థలం ఇస్తే దాన్ని ప్రభుత్వాలు లీజుకివ్వడం సిగ్గు చేటని అన్నారు.

నుమాయిష్ స్టాళ్లు

నుమాయిష్ స్టాళ్లు

సోషల్ కాజ్‌ కోసం పని చేస్తున్న సొసైటీకే ఈ స్థలాన్ని నాలుగు రోజుల్లో పట్టా ఇచ్చేస్తామని చెప్పారు. ఇక సొసైటీ లెస్సీ, కాదు పట్టాహోల్డర్ అని సిఎం కెసిఆర్ భరోసా ఇచ్చారు.

నుమాయిష్

నుమాయిష్

మొట్ట మొదటి సారిగా 1938లో పబ్లిక్‌గార్డెన్స్‌లో కేవలం ఆరు స్టాళ్లతో ఏర్పాటు చేసిన ఈ నుమాయిష్ అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందన్నారు.

నుమాయిష్

నుమాయిష్

ప్రతి ఏటా తాను కూడా నుమాయిష్‌కు వస్తూ ఉండేవాడినని తెలిపారు. జంటనగరాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కార్యచరణను సిద్ధం చేస్తున్నట్లు సిఎం వెల్లడించారు.

నుమాయిష్

నుమాయిష్

గత పాలకుల నిర్వాకం కారణంగా హైదరాబాద్ నగరం అన్ని రకాలుగా వెనకబడి పోయిందని, ఇందుకు రోజురోజుకీ తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్యే ఓ కారణమని తెలిపారు.

నుమాయిష్

నుమాయిష్

నగరంలో ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాలంటే, మూడు నిమిషాలు హాజరుకావల్సిన ఫంక్షన్ కోసం రోడ్లపై మూడు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవల్సిన పరిస్థితి నెలకొందని ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు.

నుమాయిష్

నుమాయిష్

ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు, గవర్నర్ రాజభవన్ ముందు కూడా వర్షపునీరు నిలిచి చిన్నసైజు చెరువులను తలపిస్తున్నాయంటే నగరంలో మౌలిక వసతుల పరిస్థితి ఎలా ఉందో అంచనా వేసుకోవచ్చునన్నారు.

నుమాయిష్

నుమాయిష్

అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్ సొసైటీ తెలంగాణ విద్యార్థులకు విద్యనందిస్తుందన్నారు.

నుమాయిష్

నుమాయిష్

అనాధపిల్లలకు ఎగ్జిబిషన్ సొసైటీ రూ. 4 కోట్లతో స్కూల్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు.

నుమాయిష్

నుమాయిష్

ఈ కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపి కె. కేశవరావు, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao on Thursday promised to develop Hyderabad's famous numaish better than Delhi's Pragati Maidan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X