హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వచ్ఛ: నిశితంగా నీలం ప్లాస్టిక్ డబ్బాను పరిశీలించిన కేసీఆర్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చెత్త సేకరణకు ఉపయోగించే ఆటో ట్రాలీల డిజైన్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించారు. గురువారం క్యాంప్ కార్యాలయంలో వీటిని పరిశీలించారు. డిజైన్లలో రంగులు మార్చి గ్రేటర్ కమిషనర్ సోమేష్ కుమార్ వాహనాలను క్యాంప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్‌కు చూపించారు.

సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ పథకంలో భాగంగా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడంతోపాటు చెత్తకుండీలను రోడ్లపై లేకుండా చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నగరంలోని 22లక్షల కుటుంబాలకు రెండుచొప్పున చెత్త డబ్బాలు ఇవ్వాలని నిర్ణయించారు.

చెత్త డబ్బాలకు, జీహెచ్ఎంసీ వాహనాలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

చెత్త డబ్బాలకు, జీహెచ్ఎంసీ వాహనాలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

జీహెచ్‌ఎంసీ అధికారులు డబ్బాల కొనుగోలుకు ఇటీవలే టెండర్ల ప్రక్రియను కూడా పూర్తిచేశారు. 8 ఏజెన్సీల ద్వారా వీటిని కొనుగోలు చేయాలని నిశ్చయించారు. దీనికి గురువారం సీఎం ఆమో దం తెలపడంతో త్వరలోనే చెత్తబుట్టల సరఫరా ప్రారంభం కానుంది. నీలం, ఆకుపచ్చ రంగుల్లోని ప్లాస్టిక్ చెత్త డబ్బాలను సీఎం కేసీఆర్ ఆమోదించారు.

చెత్త డబ్బాలకు, జీహెచ్ఎంసీ వాహనాలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

చెత్త డబ్బాలకు, జీహెచ్ఎంసీ వాహనాలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

వీటితో పాటు ఇంటింటి చెత్త రవాణా కోసం ఆటో టిప్పర్లకు కూడా సీఎం అంగీకారం తెలిపారు. పటాన్‌చెరులోని మహీంద్రా కం పెనీ మిగిలిన కంపెనీలకన్నా అతితక్కువ ధర(సుమారు రూ.3.8లక్షలు)కు, అలాగే వ్యర్థాల రవాణాకు అనువైన మెటల్‌తో కూడిన బాడీ తయారుచేసి ఇచ్చేందుకు ముందుకురావడంతో ఆ కంపెనీ ద్వారా వాటిని కొనుగోలు చేయాలని నిర్ణయించారు.

చెత్త డబ్బాలకు, జీహెచ్ఎంసీ వాహనాలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

చెత్త డబ్బాలకు, జీహెచ్ఎంసీ వాహనాలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

దీంతో పాటు అక్రమ భవనాలు, లేఔట్ల క్రమబద్ధీకరణ పథకం(బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్) త్వరలోనే రానుంది. కాగా, గురువారం నగరాభివృద్ధిపై జరిగిన విస్తృతస్థాయి సమీక్ష సందర్భంగా దీనిపై ఆయన మరింత స్పష్టత ఇచ్చారు. అక్రమ భవనాల విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున సమగ్రంగా అధ్యయనం చేసి సూచనలు ఇవ్వాలని నగర ప్రజాప్రతినిధులను కోరారు.

చెత్త డబ్బాలకు, జీహెచ్ఎంసీ వాహనాలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

చెత్త డబ్బాలకు, జీహెచ్ఎంసీ వాహనాలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

ఈ క్రమంలో త్వరలోనే క్రమబద్ధీకరణ పథకంపై ప్రకటన వెలువడే అవకాశముందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. నగరంలో దాదాపు లక్ష గృహాలు క్రమబద్ధీకరించుకునే వీలుందని వారు చెబుతున్నారు.

English summary
CM KCR Review Meeting on Hyderabad and GHMC vehicles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X