హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

10వ రాష్ట్రంగా తెలంగాణ: జీఎస్టీ బిల్లు ఓ మైలురాయి, సంపూర్ణ మద్దతు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జీఎస్టీ బిల్లుతో పాటు పలు ఆర్డినెన్స్‌లను ప్రభుత్వం ఈ సమావేశంలో ప్రవేశపెట్టింది. శాసనసభలో జీఎస్టీ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్, శాసన మండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రవేశపెట్టారు.

CM Kcr speech at telangana assembly sessions on tuesday

జీఎస్టీ బిల్లుపై శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. జీఎస్టీ బిల్లుకు సంబంధించిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే

* గవర్నర్ ఆదేశాల మేరకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశాం
* జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరిచాం
* ఒకే దేశం, ఒకే బిల్లు విధానం కోసం రూపొందించిన బిల్లు జీఎస్టీ బిల్లు
* రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో సగం రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి
* గతంలో సర్వీస్ ట్యాక్స్ లో రాష్ట్రాలకు వాటా లేదు
* దేశమంతా జీఎస్టీ బిల్లుని పాస్ చేస్తున్నారు
* పన్నుల ఎగవేత తగ్గించడానికి జీఎస్టీ బిల్లు ఉపయోగపడుతుంది
* ఇప్పటి వరకు 9 రాష్ట్రాలు బిల్లును పాస్ చేశాయి
* తెలంగాణ రాష్ట్రం పదో రాష్ట్రం అవుతుంది
* రాష్ట్రాలన్నీ బిల్లును ఆమోదిస్తేనే అది యాక్ట్ అవుతుంది
* రాష్ట్రాలన్నీ ఆమోదిస్తేనే జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం
* జీఎస్టీ సవరణ బిల్లుపై అనేక చర్చలు జరిగాయి
* పెట్రోల్, ఎకైజ్ విభాగాలకు జీఎస్టీ వర్తించదు
* పన్ను విధానాన్ని జీఎస్టీ కౌన్సిల్ రూపొందిస్తుంది
* ఆర్ధిక పారదర్శకత పెంచేదుకు పన్నుల ఎగవేతను అరికట్టేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుంది.

జీఎస్టీ బిల్లుపై కేసీఆర్ ప్రసంగం ముగిసింది. ఆనంతం కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాటల్లోని ముఖ్యాంశాలు

CM Kcr speech at telangana assembly sessions on tuesday

* 2005లో ఆనాటి ఆర్ధిక శాఖ మాత్యులు తన బడ్జెట్ ప్రసంగంలో జీఎస్టీ బిల్లు ప్రస్తావన తీసుకొచ్చారు
* భారత్‌లో 57 శాతం సర్వీసుల ద్వారా వస్తోంది
* జీఎస్టీ పన్నుల శాతాన్ని 18 శాతంగా ఉంచాలి అంతకు మించి పెరిగితే ప్రజలు ఇబ్బందులు పడతారు
* సీఎం చెప్పినట్టు జీఎస్టీ విధి విధానాలను పార్లమెంట్లో మళ్లీ చర్చిస్తారు
* కెనడా లాంటి దేశాలు 2001లోనే జీఎస్టీ బిల్లును తీసుకొచ్చారు
* వీలైనంత తక్కువగా ట్యాక్స్ ఉంచేలా చర్యలు తీసుకోవాలి
* జీఎస్టీ బిల్లు తీసుకురావడం వల్ల కొన్ని వస్తువుల ధరలు పెరుగుతాయని, కొన్ని వస్తువుల ధరలు తగ్గుతాయి
* పేదలను దృష్టిలో పెట్టుకుని జీఎస్టీ బిల్లు పన్ను విధానాన్ని ఉంచాలి
* పెట్రోల్ పై వచ్చే సుంకం వల్లే రాష్ట్ర ఖజానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తోంది
* డీజిల్ ఉత్పత్తికి ఒక్క రూపాయి అయితే లీటర్ డీజిల్‌ను రూ. 54 పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది.
* జీఎస్టీ బిల్లు ఎంతో మంది రాజకీయ నాయకులు మాట్లాడటం జరిగింది.

సభ్యులు చేసిన కొన్ని సూచనలు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని పార్లమెంట్‌కు పంపించాలని ఆయన కోరారు. దేశం మొత్తం ఒకే తరహా పన్ను విధానం రావడం ఎంతో సంతోషమని అన్నారు. జీఎస్టీ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఉంటుందని అన్నారు. జీఎస్టీ బిల్లు ద్వారా వచ్చే పన్నులను రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేస్తూ, తెలంగాణ ప్రజలపై అప్పుల భారాన్ని మోపకూడదని తన ప్రసంగాన్ని ముగించారు.

అనంతరం బీజేపీ శాసనసభా పక్ష నేత కిషన్ రెడ్డి మాటల్లోని ముఖ్యాంశాలు

CM Kcr speech at telangana assembly sessions on tuesday

* లోక్ సభ, రాజ్యసభ ఆమోదించిన బిల్లుని తెలంగాణ శాసనసభలో చర్చించడం సంతోషం
* స్వాతంత్యం వచ్చాక దేశంలోనే అతిపెద్ద పన్నుల సంస్కరణ జీఎస్టీ బిల్లు
* ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
* జీఎస్టీ బిల్లు భారత ఆర్ధిక సంస్కరణలో ఓ మైలు రాయి
* దేశంలో సామాజిక, సంక్షేమ కార్యక్రమాలకు ఎంతగానో ఉపయోపడుతుంది
* అందరికీ మేలు చేసే బిల్లు జీఎస్టీ బిల్లు, దేశ వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా అందరూ ఆమోదిస్తున్నారు
* 122వ రాజ్యాంగ సవరణ ద్వారా దేశంలోని కీలక సమస్యలకు జీఎస్టీ బిల్లు ద్వారా పరిష్కారం లభిస్తుంది
* పన్నుల శాతాన్ని జీఎస్టీ కౌన్సిల్ నిర్వహిస్తోంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు
* రాజకీయాలకు కన్నా దేశం మిన్న, దేశంలోని 90 రాజకీయ పార్టీలు కలిసి సంయుక్తంగా అడుగు వేస్తున్నాయి
* ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ మాదిరి అందిరి స్వప్నం జీఎస్టీ బిల్లు
* జీఎస్టీ బిల్లు వల్ల వినియోగదారుడికి ఎంతగానో ఉపయోగం
* టోల్ గేట్ కారణంగా ఒక లక్షా నలబై వేల కోట్ల ఇంధనం వృధా అవుతుంది, జీఎస్టీ బిల్లు వల్ల వాతావరణం కాలుష్యం తగ్గుతుంది
* వేధింపులు, అక్రమాల నుంచి కూడా జీఎస్టీ బిల్లుతో విముక్తి లభిస్తుంది
* అభివృద్ధిలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది
* జీఎస్టీ బిల్లుతో అందరికీ రక్షణ ఉంది, ఇంధన ధరలు తగ్గడం అందరికీ మంచిది
* గత 16 ఏళ్లుగా మన దేశంలో చర్చ జరుగుతోంది. 2009లో జీఎస్టీ బిల్లు డ్రాఫ్ట్ ఊపిరి పోసుకుంది
* బ్యాంక్ రుణాలు కూడా మరింత సులభం, వేధింపులు లేకుండా అందరికీ సులభంగా లోన్లు లభ్యమవుతాయి
* బ్యాంకుల నుంచి తీసకున్న పన్నుల ఎగవేతను కూడా అరికట్టవచ్చు
* ఏప్రిల్ 1, 2017 నుంచి కేంద్రం ఈ బిల్లును అమల్లోకి తీసుకురానుంది.
* జీఎస్టీ అమలుకు ప్రభుత్వం కూడా ప్రత్యేక ఐటీ ప్లాట్ ఫాంను అందుబాటులోకి
* ప్రతి ఒక్క మండలంలో కూడా ఐటీ నిపుణులు ఉండాల్సిన పరిస్థితి
* ప్రతి పన్ను చెల్లింపుదారుడు కూడా పాన్ కార్డు ఆధారంగా పన్ను చెల్లింపులు
* జీఎస్టీ ఆన్ లైన్ లోనే పన్ను చెల్లింపులు చాలా సులభం
* మద్యం, ముడిచమురు, హైస్పీడ్ డీజిల్, పెట్రోల్, విమాన ఇంధనం జీఎస్టీ బిల్లు పరిధిలో లేవు
* రాష్ట్రాల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని పైన పేర్కొన్న వాటిని బిల్లులో పెట్టలేదు

తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా చేసేలా కృషి చేసినందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందలు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ జీఎస్టీ బిల్లుకు బీజేపీ పూర్తిగా మద్దతు తెలుపుతుందని, సభలో ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరుతూ తన ప్రసంగాన్ని ముగించారు.

టీడీపీ నేత సండ్ర వెంకట వీరయ్య మాటల్లోని ముఖ్యాంశాలు

CM Kcr speech at telangana assembly sessions on tuesday

* పన్నులు చెల్లించే వారు ఇబ్బంది పడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి
* ఒకే పన్ను ఒకే విధానం వల్ల చిన్న తరహా పరిశ్రమలకు దెబ్బతినే అవకాశం
* చిన్న తరహా పరిశ్రమలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి
* దేశంలోనే ఎక్కడా లేని విధంగా పెట్రోల్ ఉత్పత్తులపై పన్ను విధానం ఉంది
* దానిని సమీక్షించాల్సిందిగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం

చివరగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లుకు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు తెలుపుతున్నామని తన ప్రసంగాన్ని ముగించారు.

సీపీఎం పార్టీ తరుపున సున్నం రాజయ్య మాట్లాడుతూ పేద ప్రజలపై భారం వేయకుండా పన్ను శాతాన్ని తగ్గించాలని సూచించారు. రాష్ట్ర ప్రజలకు నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. అనంతరం టీఆర్ఎస్ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జీఎస్టీ బిల్లు వల్ల విప్లవాత్మక మార్పు రాబోతుందని అన్నారు.

గతంలో సర్వీసు ట్యాక్స్ ల ద్వారా రాష్ట్రాలకు లేదని చెప్పిన ఆయన ఈ జీఎస్టీ బిల్లు వల్ల రాష్ట్రాలకు 50 శాతం ఆదాయం వస్తుందని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ బిల్లు ద్వారా ఆర్ధికంగా ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తున్నామని చెప్పారు.

టీఆర్ఎస్ పార్టీకి చెందిన సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ ఒకే దేశానికి ఒకే పన్ను విధానం ఎంతో మంచిదని అన్నారు. చాలా మంది కార్లు కొనాలనుకునే వారు పాండిచ్చేరి వెళ్లే వారని, వినియోగదారులు ఇక్కడివారైనా అక్కడి పన్నులు తక్కువగా ఉంటాయని అక్కడికి వెళ్లేవారని అన్నారు.

పర్సనల్ ట్యాక్స్, ఇన్ కమ్ ట్యాక్స్ ఇలా చాలా ఉన్నాయని వాటిని నిర్వహించడం కూడా వినియోగదారులకు భారంగా మారిందని చెప్పారు. పన్ను విధానంలో కూడా సంక్లిష్టత ఉండటంతో పన్ను చెల్లింపు దారులు ఎంతో ఇబ్బందులకు గురయ్యేవారని తెలిపారు.

జీఎస్‌టీ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం

జీఎస్‌టీ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ మధుసూధనాచారి అనుమతితో సీఎం కేసీఆర్‌ జీఎస్‌టీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అనంతరం చర్చ జరిగింది. జీఎస్‌టీ బిల్లుపై సభ్యులు చర్చించిన అనంతరం ఏకగ్రీవంగా ఆమోదించారు. జీఎస్‌టీ బిల్లు తీర్మానాన్ని సభ్యులంతా ఆమోదించటం శుభపరిణామమని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు.

తెలంగాణ శాస‌న‌స‌భ ఔచిత్యాన్ని పెంచే సంద‌ర్భం వ‌చ్చిందని వ్యాఖ్యానించారు. జీఎస్‌టీ తీర్మానం ఏక‌గ్రీవ ఆమోదం పొందినందుకు హర్షం వ్యక్తం చేశారు. బిల్లు వ‌ల్ల రాష్ట్రానికి న‌ష్టం వాటిల్లితే ఆలోటును ఐదేళ్లు భ‌ర్తీ చేస్తామ‌ని కేంద్రం స్ప‌ష్టంగా చెప్పిందని కేసీఆర్ అన్నారు. అనంతరం స్పీకర్ మధుసూదనాచారి శాసనసభను అర‌గంట వాయిదా వాయిదా వేశారు. టీ విరామం అనంతరం శాసనసభ తిరిగి కొనసాగనుంది.

సెప్టెంబర్ 20 నుంచి మళ్లీ సమావేశాలు

మంగళవారం నాడు బీఏసీ సమావేశమైంది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని నిర్ణయించారు. పది రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. ఏయే అంశాలపై చర్చించాలనేది త్వరలో నిర్ణయించనున్నారు.

English summary
CM Kcr speech at telangana assembly sessions on tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X