హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోండా మార్కెట్‌ను సందర్శించిన సిఎం కెసిఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శనివారం సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 100 కోట్లతో చారిత్రక కట్టడాలకు ముప్పు వాటిల్లకుండా మోండా మార్కెట్‌ను ఆధునీకరిస్తామని చెప్పారు.

మార్కెట్‌లో మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆయన సూచించారు. మరోసారి వచ్చి మార్కెట్ పరిస్థితులను సమీక్షిస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాపారులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

KCR

హైదరాబాద్ సమగ్ర అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష

సచివాలయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హైదరాబాద్ సమగ్ర అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, పార్లమెంటుసభ్యుడు వినోద్‌తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

హైదరాబాద్‌లోని మురికివాడలు, నాలాల మళ్లింపు, గృహ నిర్మాణం, పచ్చదనం, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనతో పాటు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. కాగా, స్వైన్ ఫ్లూతో తెలంగాణలో 27మంది మృతి చెందారని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.

అధికారులు అవినీతికి పాల్పడితే సహించం: కడియం

ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడితే సహించేది లేదని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. అధికారులు జాగ్రత్తగా పని చేసి మంచి పాలన అందించాలని సూచించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో వరంగల్ నగర పాలక సంస్థ నాశనమైందని ధ్వజమెత్తారు. సిఎం కెసిఆర్ వరంగల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు.సోమవారం జిల్లాలో రూ. 3 కోట్ల విలువైన పనులకు కడియం శంకుస్థాపన చేశారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao on Saturday visited monda market.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X