వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో 'మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్' గా.. మళ్లీ తెలంగాణే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ అవలంభిస్తోన్న విధి విధానాలకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తోంది. తాజాగా ప్రముఖ జాతీయ ఛానెల్ సీ.ఎన్.బీ.సీ టీవీ-18 మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ది ఇయర్ గా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం విశేషం. ఈ సంస్థ నుంచి ఇదే విభాగంలో తెలంగాణ రాష్ట్రం రెండోసారి అవార్డును అందుకోబోతుండడం మరో విశేషం.

ఆయా రాష్ట్రాల్లో వ్యాపార అనుకూల పరిస్థితులు, అందుకోసం రాష్ట్రాలు అవలంభిస్తోన్న విధానాలను పరిగణలోకి తీసుకుని ప్రతీ ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తోంది సీ.ఎన్.బీ.సీ. ఇదే క్రమంలో ఈ ఏడాది కాను ప్రకటించిన 'ఇండియా బిజినెస్ లీడర్స్' అవార్డుల్లో భాగంగా తెలంగాణ మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ గా ఎంపికయింది.

CNBC-TV18 selects Telangana state as Promising State of the Year

అవార్డును స్వీకరించాల్సిందిగా ఇప్పటికే సీఎన్ బీసీ నుంచి తెలంగాణ సర్కార్ కు ఆహ్వానం అందగా.. ఐటీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఈ అవార్డును స్వీకరించబోతున్నారు. అగస్టు 30వ తేదీన గ్రాండ్ న్యూఢిల్లీలో ఉన్న వసంత్ కుంజ్ ఫేస్ 2లో సాయంత్రం 5.30గం.లకు జరగబోయే కార్యక్రమంలో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. కాగా, ఈ కార్యక్రమం కోసం.. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ సహా పలువరు నేతలు హాజరుకానున్నారు.

English summary
Telangana State has been chosen for the ‘Promising State of the Year’ award by CNBC-TV18 as part of the India Business Leader Awards (IBLA)
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X