వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంటర్వ్యూలో ఆ ప్రశ్న ఎదురైనప్పుడు!.. అబద్దం చెప్పడంలో తప్పు లేదు: అమ్రపాలి

ఇంటర్వ్యూ స్కిల్స్ గురించి వివరిస్తున్న క్రమంలో.. సామర్థ్యం గురించి ప్రశ్నలు ఎదురైనప్పుడు అబద్దం చెప్పడంలో తప్పులేదన్నారు.

|
Google Oneindia TeluguNews

వరంగల్: ఇంటర్వ్యూ అన్నాక.. చురుగ్గా వ్యవహరించడం, అడిగిన ప్రశ్నలకు తడబడకుండా సమాధానాలు చెప్పడం తప్పనిసరి. అన్నింటికి మించి ఆత్మవిశ్వాసంతో కనిపించడం మరింత ముఖ్యం. అలా కాకుండా ఒత్తిడికి లోనై.. తత్తరపాటుకు గురైతే ఇంటర్వ్యూలో ఫెయిల్ అవడం ఖాయం.

అయితే ఇవి మాత్రమే కాదు, 'అబద్దాలు' అనే మరో పాయింట్ ను గుర్తుంచుకోవాల్సిన అవసరముందంటున్నారు వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి. ఇంటర్వ్యూలో సందర్భానుసారం కొన్ని అబద్దాలు చెప్పగలిగితే.. ఉద్యోగం మీదే అంటున్నారు. జిల్లాలోని ములుగు రోడ్డులో జరిగిన జాబ్ మేళాలో అమ్రపాలి ఈ వ్యాఖ్యలు చేశారు.

collector amrapali comments in job fair

ఇంటర్వ్యూ స్కిల్స్ గురించి వివరిస్తున్న క్రమంలో.. సామర్థ్యం గురించి ప్రశ్నలు ఎదురైనప్పుడు అబద్దం చెప్పడంలో తప్పులేదన్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఐదు నిమిషాలే పనిచేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ.. ఇంటర్వ్యూలో మాత్రం రెండు గంటలు పనిచేస్తానని చెప్పాలన్నారు. అలా కాకుండా.. నా సామర్థ్యం ఇంతే అంటే మాత్రం ఉద్యోగం రాదన్నారు.

అదే సమయంలో ఇంటర్వ్యూ టీం అడిగే ప్రశ్నలకు తెలిస్తే తెలుసని, తెలియకపోతే తెలియదని సూటిగా చెప్పాలని అన్నారు. నిబద్దతతో, ఆత్మవిశ్వాసంతో అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాలన్నారు. సామర్థ్యం గురించిన ప్రశ్న ఎదురైనప్పుడు మాత్రమే అబద్దం చెప్పడానికి అవకాశం ఉంటుందన్నారు. కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు నిరుద్యోగుల మేలు కోరి చేసినవే తప్పితే, అందులో ఎలాంటి దురుద్దేశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

English summary
Collector Amrapali suggested unemployees to said some lies in interviews regarding the capability. If they don't know this may they fail in interview
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X