అడవిలో 12 కి.మీ. నడిచిన అమ్రాపాలి, ఎందుకంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

మహబూబాబాద్:వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రాపాలి కాటా, మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనాలు బయ్యారం అడవుల్లో కాలినడకను 12 కిలోమీటర్లపాటు తిరిగారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఆ ఇద్దరూ కలెక్టర్లు కాలినడనక ఆ ప్రాంతంలని ప్రకృతి అందాలను చూసి పరవశించిపోయారు.

బయ్యారం అడవిలో ఉన్న చెరువును సందర్శించారు. బయ్యారంలో ప్రభుత్వం ఏర్పాటుచేయాలనుకొన్న ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన ముడిసరుకును ఇచ్చే ఇనుపఖనిజం ఉన్న గుట్టను సందర్శించారు.

 Collectors’ Day Out: Amrapali, Preeti Meena Hike In Bayyaram Forest

ఈ ఇద్దరు కలెక్టర్లతోపాటు వారి వ్యక్తిగత గన్‌మెన్లు, అటెండర్లు మాత్రమే వారితోపాటు ఉన్నారు. ఆటవిడుపు కోసం ఇద్దరూ కలెక్టర్లు ఈ అడవిలో కాలినడకన వెళ్ళారు.

అయితే ఉత్సాహంగా ఈ ప్రాంతంలో కలెక్టర్లు ప్రయాణిస్తోంటే సిబ్బంది కొంత ఇబ్బందిపడ్డారని తెలిసింది. మహబూబాబాద్ ఎమ్మెల్యే అనుచితంగా ప్రవర్తించాడని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతి మీనా రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. ఈ విషయమై ఐఎఎస్‌ల సంఘం కూడ తీవ్రంగానే స్పందించింది.

How Forests Heal People, Watch And Know
English summary
Warangal Urban District Collector Amrapali Kata and Mahabubabad District Collector Preeti Meena on Monday took a break from their hectic work to experience an adventurous trekking in Bayyaram forest, which falls under Khammam district of Telangana.
Please Wait while comments are loading...