హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎంలను ఏకిపారేశారు: పవన్ కళ్యాణ్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన తెలంగాణ రాష్ట్ర న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. న్యాయవాదులు హైదరాబాదులోని జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్‌లో పవన్ పైన ఫిర్యాదు చేశారు. ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని వారు ఫిర్యాదులో ఆరోపించారు.

తెలుగు రాష్ట్రాల తాజా రాజకీయ పరిస్థితుల పైన పవన్ కళ్యాణ్ సోమవారం నాడు సాయంత్రం విలేకరుల సమావేశంలో ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని తెలంగాణ లాయర్లు ఫిర్యాదు చేశారు.

Complaint against Pawan Kalyan in Jubilee Hills PS

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 తదితర అంశాలపై సోమవారం స్పందించారు. ఆయన ఏం చెబుతారు? అనే ఆసక్తి అందరిలోను కనిపించిన విషయం తెలిసిందే. ఓటుకు నోటు కేసులో స్పందించేందుకు పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపించలేదు.

అది కోర్టు పరిధిలో ఉన్నందున దానిని కోర్టు తేలుస్తుందని ఆయన చెప్పారు. ఓటుకు నోటుపై ప్రశ్నిస్తే.. అది కోర్టు పరిధిలో ఉందని చెప్పారు.

Complaint against Pawan Kalyan in Jubilee Hills PS

అంతేకాదు, ఏ పార్టీలోను నిజాయితీపరులు లేరని, ప్రజల కంటే పార్టీ ప్రయోజనాలో ముఖ్యమయ్యాయని, ఉన్న వాటిల్లో మంచి పార్టీతోనే సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. ఈ వ్యాఖ్యల ద్వారా రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని అంత సీరియస్‌గా భావించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోందనే వాదన వినిపిస్తోంది. సాధారణంగా ప్రజలు కూడా అలాగే ఆలోచిస్తున్నారని అంటున్నారు.

English summary
Complaint against Pawan Kalyan in Jubilee Hills PS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X