వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసులు ఉపసంహరించాలి: షబ్బీర్, మల్లు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం సందర్భంగా విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించాలని తెలంగాణ పిసిసి ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే విద్యార్థులపై ఉన్న కేసులను తొలగిస్తామని సార్వత్రిక ఎన్నికల ముందు టిఆర్‌ఎస్ హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.

బుధవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరు వీరుల కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని అన్నారు. తన భర్త ప్రాణ త్యాగం చేసినా తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవడం లేదన్న వ్యధతో వికారాబాద్‌లో ఓ అమరవీరుని భార్య ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు షబ్బీర్ అలీ తెలిపారు.

డెంగీ కేసులే లేవని ఉప ముఖ్యమంత్రి రాజయ్య చెప్పారని, అయితే వంద కేసులు నమోదైనట్లు పత్రికల్లో వార్త వచ్చిందని ఆయన ఒక పత్రికను చూపించారు. మాజీ ఎంపి మల్లు రవి మాట్లాడుతూ.. జూనియర్ డాక్టర్ల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వారితో చర్చలు జరిపి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ల, ఇతర పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. ఉస్మానియా విద్యార్థుల నాయకుడు రమేష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. తనపై 150 కేసులు ఉన్నాయని తెలిపారు. యూనివర్సిటీ ఆవరణలో ఇనుప కంచెలు, పోలీసు క్యాంపులు ఇంకా ఎత్తివేయలేదని చెప్పారు.

మీడియాతో కాంగ్రెస్ నేతలు

మీడియాతో కాంగ్రెస్ నేతలు

తెలంగాణ ఉద్యమం సందర్భంగా విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించాలని తెలంగాణ పిసిసి ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మీడియాతో కాంగ్రెస్ నేతలు

మీడియాతో కాంగ్రెస్ నేతలు

అధికారంలోకి రాగానే విద్యార్థులపై ఉన్న కేసులను తొలగిస్తామని సార్వత్రిక ఎన్నికల ముందు టిఆర్‌ఎస్ హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.

మీడియాతో కాంగ్రెస్ నేతలు

మీడియాతో కాంగ్రెస్ నేతలు

బుధవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరు వీరుల కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని అన్నారు.

మీడియాతో కాంగ్రెస్ నేతలు

మీడియాతో కాంగ్రెస్ నేతలు

తన భర్త ప్రాణ త్యాగం చేసినా తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవడం లేదన్న వ్యధతో వికారాబాద్‌లో ఓ అమరవీరుని భార్య ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు షబ్బీర్ అలీ తెలిపారు.

మీడియాతో కాంగ్రెస్ నేతలు

మీడియాతో కాంగ్రెస్ నేతలు

మాజీ ఎంపి మల్లు రవి మాట్లాడుతూ.. జూనియర్ డాక్టర్ల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వారితో చర్చలు జరిపి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

English summary
Congress leaders Shabbir Ali and Mallu Ravi on Wednesday demanded for withdrawal of cases on students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X