హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ ధర్నా, కడుపు నిండా భోజనమని తలసాని, పార్టీ మార్పుపై జానా

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట కాంగ్రెస్‌ నాయకులు మెరుపు ధర్నాకు దిగారు. ధర్నాలో తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, సీనియర్ నేతలు వి హనుమంత రావు, మల్లు భట్టి విక్రమార్క, దానం నాగేందర్‌, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్‌ చేశారు. వారు డౌన్ డౌన్ కెసిఆర్ నినాదాలు చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేసి గాంధీ నగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. నారాయణగూడ చౌరస్తా వద్ద వామపక్షాల ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది.

మరోవైపు, పార్టీ మారుతున్నానన్న వార్తల పైన జానారెడ్డి వేరుగా స్పందించారు. తాను పార్టీ మారడం లేదని చెప్పారు. అలాంటి వార్తలు ప్రచారం చేస్తే విశ్వసనీయత కోల్పోతారన్నారు.

కడుపు నిండా భోజనం పెడతానన్న కెసిఆర్: తలసాని

తాను కార్మికులకు కడుపు నిండా భోజనం పెడతానని కెసిఆర్ చెప్పారని, అన్నట్లుగానే వారికి జీతాలు పెంచారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై కెసిఆర్ సానుకూలంగా ఉన్నారని చెప్పారు.

తాము కూడా ఊహించని విధంగా 47.05 శాతం జితాలు పెంచారన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. ధర్నాలు వద్దు.. దరఖాస్తులు పెట్టుకోవాలని తాము కార్మికులకు సూచించామన్నారు.

తలసాని, జానా

తలసాని, జానా

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు శుక్రవారం నాడు సచివాలయం వద్ద మెరుపు ధర్నాకు దిగారు. దీనిపై తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.

భట్టి

భట్టి

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు శుక్రవారం నాడు సచివాలయం వద్ద మెరుపు ధర్నాకు దిగారు. భట్టిని అదుపులోకి తీసుకుంటున్న భద్రతా సిబ్బంది.

కాంగ్రెస్

కాంగ్రెస్

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు శుక్రవారం నాడు సచివాలయం వద్ద మెరుపు ధర్నాకు దిగారు. ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు.

కాంగ్రెస్

కాంగ్రెస్

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు శుక్రవారం నాడు సచివాలయం వద్ద మెరుపు ధర్నాకు దిగారు. అరెస్టు సమయంలో...

దానం

దానం

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు శుక్రవారం నాడు సచివాలయం వద్ద మెరుపు ధర్నాకు దిగారు. దానంను అదుపులోకి తీసుకుంటున్న భద్రతా సిబ్బంది.

ఉత్తమ్

ఉత్తమ్

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు శుక్రవారం నాడు సచివాలయం వద్ద మెరుపు ధర్నాకు దిగారు. ఉత్తంను అదుపులోకి తీసుకుంటున్న భద్రతా సిబ్బంది.

ఉత్తమ్

ఉత్తమ్

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు శుక్రవారం నాడు సచివాలయం వద్ద మెరుపు ధర్నాకు దిగారు. ఉత్తంను అదుపులోకి తీసుకున్న దృశ్యం.

కాంగ్రెస్

కాంగ్రెస్

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు శుక్రవారం నాడు సచివాలయం వద్ద మెరుపు ధర్నాకు దిగారు. అడ్డుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు.

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదోళ్ల కోసం ఆలోచించలేదన్నారు. కాంగ్రెస్ పేదల కోసం ఉద్యమించడం హాస్యాస్పదం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకుంటామని చెప్పారు. జీతాల పెంపుతో కార్మికులు సంతోషంగా ఉన్నారని చెప్పారు.

కొన్ని పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. వామపక్ష పార్టీలు ఏనాడూ పేదల కోసం పని చేయలేదన్నారు. అవి చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు.

కొన్ని పార్టీలు రాజకీయ ఉద్దేశ్యంతో కార్మికులను రెచ్చగొడుతున్నాయన్నారు. అందరు బాగుపడితేనే బంగారు తెలంగాణ అన్నారు. ప్రతి దానికి జిహెచ్ఎంసీ ఎన్నికలతో ముడి పెట్టవద్దన్నారు. ఏం చేసినా జిహెచ్ఎంసి ఎన్నికలకే సంబంధమా అన్నారు. ప్రతి దానిని అలా ముడిపెట్టవద్దన్నారు.

కాగా, తెలంగాణలో మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచుతున్నట్లు కెసిఆర్ చెప్పారు. అయితే, ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి ధర్నాను మొన్నటి వరకు ఆపేసిన వారికి జీతాలు పెంచుతున్నారు. ఆందోళనలో పాల్గొన్న ఉద్యోగులను విధుల నుండి తీసివేయాలని ఆదేశించినట్లుగా వార్తలు వచ్చాయి.

English summary
Congress leaders arrest, Talasani Srinivas Yadav lashes out
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X