నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్య, కూతురు హత్య: కానిస్టేబుల్‌ను రాళ్లతో కొట్టి చంపారు

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని గాజుల్ పేట్ ప్రాంతంలో మంగళవారం రాత్రి వర్ని దారుణ ఘటన చోటు చేసుకుంది. వర్ని పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ను స్థానికులు రాళ్లతో కొట్టి చంపేశారు. మృతుడు రెండున్నరేళ్ల క్రితం భార్య, కూతురును హత్య చేసిన ఆరోపణలతో జైలుకు వెళ్లి ఇటీవలే బెయిల్‌పై బయటికి వచ్చాడు.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కానిస్టేబుల్ వెంకటేశ్ తరుచూ మద్యం తాగివచ్చి భార్య బిడ్డలను వేధించేవాడని స్థానికులు ఆరోపించారు. ఈ క్రమంలోనే 2012, డిసెంబర్ 8వ తేదీన దుబ్బా ప్రాంతంలోని తన ఇంట్లో భార్య వనజ, ఐదేళ్ల కూతురు పద్మశ్రీ దారుణ హత్యకు గురయ్యారు.

ఈ సంఘటనలో కానిస్టేబుల్ వెంకటేశ్‌ను నిందితుడిగా భావించిన నగర మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లో జిల్లా ఎస్పీ అతడిని సస్పెండ్ చేశారు. అరస్టైన వెంకటేశ బెయిల్‌పై వచ్చి మరో మహిళను వివాహం చేసుకున్నాడు. మంగళవారం రాత్రి మద్యం సేవించి గాజుల్‌పేట్‌లోని మొదటి భార్య వనజ పుట్టింటికి వచ్చాడు. ఇంట్లోని వారిపై దాడిచేసి భయాందోళనకు గురిచేశాడు.

 A constable allegedly murdered by villagers in Nizamabad district

తన కుమారుడు ఉమాకాంత్ ఎక్కడ ఉన్నాడని వెతకడం ప్రారంభించాడు. ఆ బాలుడికి ఎలాంటి హాని తలపెడతాడోనని ఆందోళన చెందిన కుటుంబీకులు, చుట్టుపక్కల వారు ఆగ్రహించి కానిస్టేబుల్‌ను వెంబడించి రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ వెంకటేశ్ తలపగిలి అక్కడిక్కడే మృతిచెందాడు.

అనంతరం స్థానికులు సదరు కానిస్టేబుల్‌కు చెందిన ద్విచక్రవాహనాన్ని రోడ్డుపై పడేసి రాళ్లతో ధ్వంసం చేశారు. ఇంకా, కోపం చల్లారని స్థానికులు కానిస్టేబుల్ మృతదేహాన్ని దహనం చేసేందుకు కిరోసిన్ పోశారు.

విషయం తెలుసుకున్న సిఐ నర్సింగ్‌యాదయ్య, రెండో టౌన్ ఎస్సై బోసుకిరణ్ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

English summary
A constable allegedly murdered by villagers in Nizamabad district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X