హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరాతకం:3 నెలలపాపపై అత్యాచారం, నిందితుడికి జీవిత ఖైదు

ముక్కుపచ్చలారని మూడు నెలల పసిపాపపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి కె.సునీత గురువారం నాడు తీర్పు చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముక్కుపచ్చలారని మూడు నెలల పసిపాపపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి కె.సునీత గురువారం నాడు తీర్పు చెప్పారు.అంతేకాదు నిందితుడికి రూ.4 వేలను జరిమానాను విధించారు.

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండల కేంద్రంలోని పోచమ్మ బస్తీకి చెందిన పెడి కృష్ణ ప్రైవేట్ ఎలక్ట్రీషీయన్ గా పనిచేసేవాడు. అయితే తన ఇంటికి సమీపంలో2015 నవంబర్ 20వ, తేదిన తల్లి పక్కనే నిద్రిస్తున్న మూడు నెలల పసిపాపను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశాడు.

cyberabad metropalitan session judge ordered to krishna life sentence

అయితే తెల్లవారుఝామున నిందితుడిని పట్టుకొని నిలదీస్తే పొంతనలేని సమాధానాలు చెప్పాడు.నిందితుడిని అరెస్టు చేసి బాధితురాలిని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి అభియోగపత్రం దాఖలు చేశారు.

నిందితుడు మూడు మాసాల పసిపాపపై అత్యాచారం చేసినట్టుగా కోర్టు నిర్దారించింది.అయితే తనకు శిక్ష విషయంలో నిందితుడు క్షమించాలని కోర్టును కోరారు.
ఈ రకమైన నేరాలకు పాల్పడిన నిందితులకు చట్టప్రకారంగా శిక్ష పడాల్సిందేనని జడ్జి అభిప్రాయపడ్డారు.

నేరానికి ఏడేళ్ళ జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా,పోక్సో చట్టం ప్రకారంగా జీవిత ఖైదు, రూ2 వేల ప్రకారం జరిమానాను విధిస్తూ రెండు శిక్షలను ఏకకాలంలో అమల్లో ఉంటాయని కోర్టు తీర్పు చెప్పింది.జరిమానాను చెల్లించకపోతే మరో 9 మాసాలపాటు కఠిన కారాగార శిక్షను అనుభవించాలని కోర్టు తన తీర్పులో వెల్లడించింది.

English summary
cyberabad metropalitan session judge ordered to krishna life sentence for rape on three months girl on thursday.krishna raped on three months baby on 2015 nov20.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X