వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిరీష-రాజీవ్‌లు మద్యం తాగారు, సిసిటీవీలు ఉన్నాయి కానీ..: డిసిపి

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో పోలీసులు సీన్‌ను రీ-కన్‌స్ట్రక్షన్ చేయలేదన్న విమర్శలపై డిసిపి వెంకటేశ్వర రావు బుధవారం స్పందించారు. ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో పోలీసులు సీన్‌ను రీ-కన్‌స్ట్రక్షన్ చేయలేదన్న విమర్శలపై డిసిపి వెంకటేశ్వర రావు బుధవారం స్పందించారు. ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు. నిందితులు రాజీవ్, శ్రవణ్‌లను కుకునూరుపల్లికి తీసుకెళ్లామన్నారు.

శిరీష - రాజీవ్‌లు భార్యాభర్తలని చెప్పడంతో షాకైన తేజస్విని!శిరీష - రాజీవ్‌లు భార్యాభర్తలని చెప్పడంతో షాకైన తేజస్విని!

నిందితులతో కలిసి సీన్‌ను రీ కన్‌స్ట్రక్షన్ చేశామని తెలిపారు. కుకునూరుపల్లి వెళ్లిన, వచ్చిన రూట్‌ను నిందితులతో కలిసి అనలైజ్ చేసామని తెలిపారు. కుకునూరుపల్లి వెళ్లడానికి ముందు కప్పా కాఫీ షాపులో వారు భేటీ అయ్యారని చెప్పారు.

DCP clarifies on scene reconstruction in Sirisha's death case

అక్కడి నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వచ్చి ఎస్సైతో 5 నిమిషాలు మాట్లాడారని తెలిపారు. అనంతరం బంజారాహిల్స్‌లో మద్యం తాగి, రాయదుర్గంలో ఫుడ్ తీసుకున్నారన్నారు. రాయదుర్గం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా కుకునూరుపల్లి వెళ్లారన్నారు.

అక్కడి నుంచి అర్ధరాత్రి సమయంలో శామీర్ పేట, అల్వాల్ మీదుగా షేక్ పేట చేరుకున్నారని చెప్పారు. ఎస్సై ఆత్మహత్య చేసుకున్న క్వార్టర్స్‌కు తాము వెళ్లలేదని, ఆ అవసరం కూడా లేదని డిసిపి చెప్పారు. బయటి నుంచి మొత్తం చూసి వచ్చామన్నారు.

అక్కడి క్వార్టర్ మొత్తం పోలీసుల కస్టడీలో ఉందని తెలిపారు. కేసులో పూర్తి ఆధారాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. శిరీష ఆత్మహత్య చేసుకున్న గదిలో సిసి కెమెరాలు ఉన్నాయని తెలిపారు. కానీ కనెక్టివిటీ లేక ఎక్కడా రికార్డు కాలేదన్నారు.

English summary
DCP Venkateswara Rao clarified on scene reconstruction in beautician Sirisha's death case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X