బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టుకు డిమాండ్, ధార్మిక వ్యవస్థకే కళంకం'

కర్నాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని సిపిఐ నేత నారాయణ డిమాండ్ చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని సిపిఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. రూ.100 కోట్ల రూపాయల పాత కరెన్సీని మార్పిడి చేసి వైట్‌గా మార్చుకున్నారని విమర్సించారు.

అలాగే, ఐటీ దాడులలో టిటిడి (తిరుమల తిరుపతి దేవస్థానం) సభ్యుడు శేఖర్ రెడ్డి పట్టుబడటం సిగ్గుచేటు అన్నారు. ఆయన వద్ద కిలోల కొద్ది బంగారం, కోట్లాది రూపాయలు లభించాయని గుర్తు చేశారు. శేఖర్ రెడ్డి ధార్మిక వ్యవస్థకే కళంకం తెచ్చారని ఆరోపించారు.

వైభవంగా కూతురు పెళ్లి

వైభవంగా కూతురు పెళ్లి

కోట్లాది రూపాయలతో తన కూతురు పెళ్లిని అంగరంగా వైభవంగా చేసిన మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోన్న విషయం తెలిసిందే. నోట్ల రద్దు తర్వాత తన కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చేశాడు. అయితే, రూ.100 కోట్ల నల్లధనాన్ని తెల్లగా మార్చినట్లుగా ఆయన పైన తాజాగా ఆరోపణలు వచ్చాయి.

అధికారి సాయంతో వంద కోట్ల మార్పిడి

అధికారి సాయంతో వంద కోట్ల మార్పిడి

కేఏఎస్ అధికారి భీమా నాయక్ వద్ద డ్రైవర్‌గా పని చేసే రమేష్ గౌడ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇది కర్నాటకలో సంచలనం రేపుతోంది. గాలి అధికారి భీమా నాయక్ సాయంతో ఇరవై శాతం కమీషన్‌తో రూ.100 కోట్ల నల్లధనాన్ని తెల్లగా మార్చుకున్నాడు. ఇందుకు కమీషన్‌తో పాటు 2018 ఎన్నికల్లో సీటు ఇప్పించడంలో సాయం చేయాలని కూడా అడిగినట్లు తెలుస్తోంది.

మరోవైపు టిటిడి బోర్డు సభ్యుడు

మరోవైపు టిటిడి బోర్డు సభ్యుడు

పెద్దనోట్ల రద్దు తర్వాత తమిళనాడులోనే అత్యంత ఎక్కువ మొత్తం ధనం, బంగారం బయటపడిన సంఘటన జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి సభ్యుడు శేఖర్ రెడ్డి నుంచి 90 కోట్ల రూపాయల నగదు, వంద కిలోల బంగారం ఐటి అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. శేఖర్ రెడ్డిది తమిళనాడులోని వేలూరు జిల్లా కట్పాడి సమీపంలోని తొండ్ర తులసి అనే గ్రామం. ప్రస్తుత ముఖ్యమంత్రి, 2001లో ప్రజా పనుల శాఖమంత్రిగా ఉన్న పన్నీర్‌ సెల్వానికి దగ్గరయినప్పటి నుంచి అతని జాతకమే మారినట్లు చెబుతారు. జయ నెచ్చెలి శశికళతోను పరిచయాలున్నాయట.

 'గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టుకు డిమాండ్, ధార్మిక వ్యవస్థకే కళంకం'

'గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టుకు డిమాండ్, ధార్మిక వ్యవస్థకే కళంకం'


ఓ వైపు గాలి జనార్ధన్ రెడ్డి మార్పిడి అక్రమాలు, మరోవైపు టిటిడి బోర్డు సభ్యుడిగా ఉంటూ శేఖర్ రెడ్డి చేసిన అక్రమాలు బయటపడటంతో తాజాగా, సిపిఐ నారాయణ వారి అరెస్టుకు డిమాండ్ చేస్తున్నారు. శేఖర్ రెడ్డి ధార్మిక వ్యవస్థకు కళంకం తెచ్చారని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Demand for Former Karnataka minister Gali Janardhan Reddy's arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X