హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కూల్చివేతలు: అడ్డుకున్న ఎమ్మెల్యే, మేయర్‌కు వ్యతిరేక నినాదాలు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని నాలాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలు మూడో రోజూ కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు రామాంతపూర్, గచ్చబౌలి, కొండాపూర్, గోకుల్‌ప్లాట్స్, ఇందిరానగర్, మంజీరారోడ్, మాతృశ్రీనగర్, సురక్ష కాలనీలోని అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు.

గత రెండు రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లోని నాలాలపై అక్రమ నిర్మాణాలతో పాటు కట్టడాలను కూడా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. అక్రమ కట్టడాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పడంతో బుధవారం కూడా జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు.

నగరంలోని నాలాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలు మూడో రోజూ కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు రామాంతపూర్, గచ్చబౌలి, కొండాపూర్, గోకుల్‌ప్లాట్స్, ఇందిరానగర్, మంజీరారోడ్, మాతృశ్రీనగర్, సురక్ష కాలనీలోని అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు.

 కూల్చివేతలను అడ్డుకున్న స్థానికులు

కూల్చివేతలను అడ్డుకున్న స్థానికులు


డాక్యుమెంట్లను చూపించి మరీ అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. కుషాయి గూడలో జరుగుతున్న కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. దీనిని స్థానిక ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అడ్డుకుంటున్నారు. స్థానికులు మాత్రం కూల్చివేతలను అడ్డుకోవడంపై నిలదీస్తున్నారు. వర్షం వల్ల నీళ్లు తమ ఇళ్లలోకి వచ్చినపుడు ప్రభాకర్ ఎక్కడకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 చర్లపల్లిలో మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు

చర్లపల్లిలో మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు


మరోవైపు చర్లపల్లిలో కూల్చివేతలను కూడా స్థానికులు అడ్డుకుని, మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూకట్ పల్లిలోని వివేకానంద నగర్‌లో నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. కేపీహెచ్ బీ రోడ్ నెంబర్ 2లో కూడా జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. అంతేకాకుండా పీవీ ఎక్స్ ప్రెస్ హైవేను ఆనుకుని ఉన్న అక్రమ కట్టడాలపై కూడా జీహెచ్ ఎంసీ దృష్టి సారించింది.

 టౌన్ ప్లానింగ్ అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ సమీక్ష

టౌన్ ప్లానింగ్ అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ సమీక్ష

మూడు రోజు జరగుతున్న కూల్చివేతలపై జీహెచ్ఎంసీ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మంగళవారం ఒక్కరోజే 204 కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఆక్రమణలపై నియమించిన నాలాలు, లేక్స్, పురాతన భవనాలపై అధికారులు దృష్టిసారించి మరీ కూల్చివేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా కట్టిన కంపోండ్‌వాల్స్, నాలాలపై నిర్మించిన ఇళ్లను తొలిగించారు. అనుమతిలేకుండా నిర్మించిన వాటిని తొలిగించివేశారు.

 అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందే

అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందే


అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందేనని, ఈ దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అమలు చేయాల్సిందేనని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న అధికారులపై తాను ఒత్తిడి తెచ్చినట్టుగా, వారిని అడ్డుకున్నట్లుగా ఓ వార్తా పత్రికలో వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. ఆక్రమణల తొలగింపులో వాగ్వాదం జరుగుతోందని, బిల్డర్ అడ్డుపడుతున్నాడని చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి తనకు ఫోన్ చేశారన్నారు. ఆ పరిస్థితిని సద్దుమణచడానికి మాత్రమే అక్కడికి వెళ్లినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

నాపై వచ్చిన వార్తలు అబద్ధం: మూసాపేట్ కార్పొరేటర్

నాపై వచ్చిన వార్తలు అబద్ధం: మూసాపేట్ కార్పొరేటర్


ఆక్రమణల తొలగింపును తాను అడ్డుకుంటున్నట్లుగా వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధమని మూసాపేట్ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ మంగళవారం వెల్లడించారు. సీఎం కేసీఆర్ ప్రజల శ్రేయస్సు కోసం చేపడుతున్న కూల్చివేతలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. తన స్నేహితుడి ఇల్లు కూల్చివేస్తున్నట్టుగా సమాచారం అందడంతో అక్కడికి వెళ్లానని, పైగా అది తన డివిజన్ కూడా కాదని చెప్పారు.

 ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించడం లేదు

ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించడం లేదు


నాలాలపైన ఉన్న అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించడం లేదని చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు వ్యతిరేకంగా తాము అధికారులపై ఒత్తిడి తెచ్చినట్టుగా తనపై వచ్చిన వార్తలు నిరాధారమన్నారు. నాలాలపై అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నా, వాటిని వెంటనే కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ ఉప కమిషనర్ తానే స్వయంగా ఫిర్యాదు ఇచ్చినట్టు తెలిపారు.

English summary
Demolition of buildings in hyderabad continues on third day in Hydrabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X