హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిట్ కార్యాలయానికి నవ్వుతూ రవితేజ: అభిమానుల కోలాహలం

డ్రగ్స్‌కేసు విచారణలో భాగంగా శుక్రవారం ప్రముఖ టాలీవుడ్‌ హీరో భూపతిరాజు రవిశంకర్‌ రాజు అలియాస్‌ రవితేజను సిట్‌ ప్రశ్నించనుంది. ఉదయం 10.30 గంటలకు సిట్‌ కార్యాలయంలో ఈ విచారణ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: డ్రగ్స్ కేసులో నోటీసులందుకున్న ప్రముఖ హీరో భూపతిరాజు రవిశంకర్‌ రాజు అలియాస్‌ రవితేజ శుక్రవారం ఉదయం 10గంటలకు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. డ్రగ్స్‌కేసు విచారణలో భాగంగా సిట్‌ ఆయనను ప్రశ్నిస్తోంది. కాగా, ఇప్పటి వరకు ఎవరు వచ్చినా రాని అభిమానులు.. రవితేజ వస్తున్నాడని తెలిసి సిట్ కార్యాలయం వద్ద గుమిగూడటం విశేషం.

తమ హీరో ఏ తప్పూ చేయలేదని అభిమానులు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. విచారణ తర్వాత అన్ని నిజాలు తెలుస్తాయని చెప్పారు. డ్రగ్స్ కేసుతో తమ హీరోకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా, రవితేజ కూడా నవ్వుతూ సిట్ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటి వరకు హాజరైన వారందరూ మెట్ల ద్వారా సిట్ కార్యాలయం పై అంతస్తుకు వెళితే.. రవితేజను మాత్రం లిఫ్టులోనే పై అంతస్తుకు పంపించడం గమనార్హం.

కీలకం కానున్న రవితేజ

కీలకం కానున్న రవితేజ

కాగా, 12 మంది సినీ ముఖ్యులకు నోటీసులు పంపిన అధికారులు.. ఆగస్టు 2తో విచారణను పూర్తి చేయనున్నారు. ఈ 12మందిలో దర్శకుడు పూరి జగన్నాథ్‌, రవితేజలే కీలకమని సిట్‌ భావిస్తోంది. రవితేజకు మాస్‌ ఫాలోయింగ్‌ ఉంది. సినీరంగంలో గాడ్‌ఫాదర్‌ లేకుండా, కష్టపడి పైకి వచ్చాడనే మంచి పేరు కూడా ఉంది. కానీ, ఇలాంటి హీరో డ్రగ్స్‌ కేసులో నోటీసులు అందుకోవడంతో ఆయన అభిమానులు కలవరానికి గురయ్యారు.

Recommended Video

Ravi Teja Skipped His Brother Bharat's Funeral? Find out the Facts | Filmibeat Telugu
వారితో సంబంధాలపై ఆరా..

వారితో సంబంధాలపై ఆరా..

డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన నిందితుడు జీషన్‌ అలీ... సినీ హీరోలు రవితేజ, నవదీప్‌లకు తాను కొకైన్‌ సరఫరా చేసేవాడినని ఎక్సైజ్‌ అధికారుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఈవెంట్లు, పబ్‌లలో పలువురు సినీ ప్రముఖులకు కొకైన్‌ అందించినట్లు జీషన్‌ అలీ చెప్పాడు. నవదీప్‌ పబ్‌లో నిర్వహించిన ఈవెంట్లలోనూ జీషన్‌ పాల్గొన్నాడు.

ఆ ఆధారాలతో విచారణ

ఆ ఆధారాలతో విచారణ

డ్రగ్స్‌ కేసులో మరో నిందితుడు కెల్విన్‌ కూడా సినీ ప్రముఖులకు డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు విచారణలో అంగీకరించాడు. పైపెచ్చు, ఈ కేసులో అరెస్టుచేసిన నిందితుల ఫోన్లలోని వాట్సాప్‌ చాటింగ్‌లు, సంభాషణలు, వీడియో క్లిప్పింగులు, ఫోన్‌ కాల్‌డాటాలు అధికారుల వద్ద ఉన్నాయి. పూరి జగన్నాథ్‌తో రవితేజకు సన్నిహిత సంబంధాలున్నాయని, వీరిద్దరూ ‘బ్యాంకాక్‌ బ్యాచ్‌'లో భాగస్వాములన్న వార్తలూ వెలువడ్డాయి.

మరింత సమాచారం..

మరింత సమాచారం..

పూరి, రవితేజల నుంచే ఈ కేసులో ఎక్కువ సమాచారాన్ని రాబట్టవచ్చన్న అంచనాలో ఉన్నారు. ఇప్పటికే పూరిని విచారించిన అధికారులు కొంత సమాచారాన్ని రాబట్టారు. ఇక రవితేజను విచారిస్తే... మరింత సమాచారం వస్తుందని భావిస్తున్నట్లు తెలిసింది. కాగా, ఇప్పటికే రవితేజ సోదరులపై డ్రగ్స్ ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవలే రవితేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

English summary
Tollywood star Bhupatiraju Ravi Shankar Raju alias Ravi Teja will appear before SIT on drug cases on Friday. The SIT issued notice to Ravi Teja under Section 67 of NDPS Act after finding his driver’s number in the mobile phone book of alleged mastermind Calvin Mascarenhas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X