హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు: 9మంది అరెస్ట్, డ్రగ్స్ స్వాధీనం

ఇప్పటికే కెల్విన్ డ్రగ్ మాఫియా కలకలం సృస్టిస్తుండగా.. నగరలో మరో డ్రగ్స్ రాకెట్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేధించారు. ఇద్దరు నైజీరియన్లు సహా 9మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇప్పటికే కెల్విన్ డ్రగ్ మాఫియా కలకలం సృస్టిస్తుండగా.. నగరలో మరో డ్రగ్స్ రాకెట్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేధించారు. ఇద్దరు నైజీరియన్లు సహా 9మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 300గ్రాముల కొకైన్, 42గ్రా.ల ఎండీఎంఏ, 27ఎస్ఎన్‌డీ యూనిట్లు, ఓ కారు, ఎయిర్‌గన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గోవా నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం హైదరాబాద్‌లో డ్రగ్ మాఫియా వ్యవహారు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పాఠశాల విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతోపాటు సినీ ప్రముఖులు కూడా ఈ డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 12మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన ఎక్సైజ్ శాఖ.. బుధవారం సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను విచారించారు.

Drugs: 9 arrested in Hyderabad

గంజాయి సేవిస్తున్న లా విద్యార్థి అరెస్ట్

గంజాయి సేవిస్తున్న ఓ లా విద్యార్థిని ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేసి, అతడి నుంచి 20గ్రా.ల గంజాయి, కారు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతడ్ని రిమాండ్‌కు తరలించారు. ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా చెందౌలి గ్రామానికి చెందిన సాయిని అరవింద్ అసీఫ్‌నగర్‌లో ఉంటూ దోమలగూడలోని ఏవీ కళాశాలలో ఎల్ఎల్‌బీ చదువుతున్నాడు.

గత ఆరు నెలలుగా గంజాయికి బానిసైన అతను జులై 17న ఔట్ రింగ్ రోడ్డుపై టీసీఎస్ సమీపంలో వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులకు గంజాయి సేవిస్తూ కనిపించాడు. ఆదిభట్ల సీఐ గోవింద్ రెడ్డి అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా ధూల్‌పేట్‌కు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి నుంచి రూ.500లకు గంజాయి కొనుగోలు చేసినట్లు తెలిపాడు. విద్యార్థిని అరెస్ట్ చేసి 20గ్రా.ల గంజాయి, ఒక వైట్ రోల్ పేపర్, కారు, సెల్ ఫోన్ స్వాధీని చేసుకుని రిమాండ్ కు తరలించారు. మీడియా సమావేశంలో ఏసీపీ మల్లారెడ్డి, ఆదిభట్ల సీఐ గోవింద్ రెడ్డి, ఎస్ఐ కృష్ణంరాజు పాల్గొన్నారు.

English summary
9 persons arrested in Hyderabad on Wednesday due supplying drugs in city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X