హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్స్ కేసు: చార్మీ విచారణ కీలకం, దిమ్మ తిరిగే సినిమా ట్విస్ట్?

డ్రగ్స్ కేసులో హీరోయిన్ చార్మీ విచారణను సిట్ అధికారులు కీలకంగా భావిస్తున్నారు. ఆమెను ప్రశ్నిస్తే పలు కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో హీరోయిన్ చార్మీ విచారణను సిట్ అధికారులు కీలకంగా భావిస్తున్నారు. ఆమెను ప్రశ్నిస్తే పలు కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, వాటిలోని నిజానిజాలను అధికారులు తేల్చాల్సి ఉంది.

చార్మీ నటించిన జ్యోతిలక్ష్మి సినిమా వేడుకల్లోనే కాకుండా ఆమె జన్మదిన వేడుకల్లోనూ కెల్విన్ కనిపించడం కీలకంగా మారింది. దీంతో చార్మీ ఎంట్రీ తర్వాత మరిన్ని ట్విస్టులు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. పూరీ విచారణకు ముందు ఒక రకంగా కేసు మామూలుగానే కనిపించింంది.

శ్యాం కె నాయుడు, ఆ తర్వాత సుబ్బరాజు బయటపెట్టిన విషయాలు పూరీ జగన్నాథ్‌ను పూర్తిగా ఇరికించినట్లు భావిస్తున్నారు. సుబ్బరాజు గానీ శ్యాం కే నాయుడు గానీ కేవలం పూరీని ఇరికించడానికి మాత్రమే విషయాలను చెప్పి ఉండరనేది అర్థమవుతోంది. దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు ఊపిరాడక, ఉక్కిరి బిక్కిరి అయి విషయాలను చెప్పినట్లు సమాచారం.

26వ తేదీన చార్మీ...

26వ తేదీన చార్మీ...

డ్రగ్స్‌ కేసులో విచారణకు సినీనటి చార్మిని ఈ నెల 26వ తేదీన ఎక్సైజ్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారిస్తుంది. ఈ మేరకు ఆమెకు సమాచారం అందించింది. కాగా ఇదే కేసులో యువహీరో తరుణ్‌ శనివారం సిట్‌ ముందుకు వచ్చాడు.

27న ముమైత్ ఖాన్...

27న ముమైత్ ఖాన్...

ఐటమ్‌ గర్ల్‌ ముమైత్‌ఖాన్‌ విచారణపై సందిగ్ధం ఏర్పడిందని అంటున్నారు. ఆమెను ఈ నెల 27న విచారించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు బిగ్‌బాస్‌ కార్యక్రమ నిర్వాహకుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్న అధికారులు ఆమెను 27న సిట్‌ ముందు హాజరు కావాలని చెప్పారు.

తెలంగాణపై అంతర్జాతీయ కుట్ర

తెలంగాణపై అంతర్జాతీయ కుట్ర

అంతర్జాతీయంగా తెలంగాణ పేరును దెబ్బతీయడానికి కాంగ్రెస్‌ నాయకులు కుట్రలు పన్నుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాదని గుర్తించిన దిగ్విజయ్‌సింగ్‌ మతిభ్రమించి, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. డ్రగ్‌ రాకెట్‌లో తెరాస నాయకులు ఎవరున్నారో బయటపెట్టాలని ఆయన దిగ్విజయ్‌కు సవాల్‌ విసిరారు. పేర్లు వెల్లడిస్తే 24 గంటల్లో వారిని జైలులో పెడతామని చెప్పారు.

పబ్‌ను విక్రయించిన తరుణ్

పబ్‌ను విక్రయించిన తరుణ్

డ్రగ్స్‌ వ్యవహారంలో తనకు ఏ సంబంధం లేదని తరుణ్ ఇప్పటికే చెప్పారు. ఆయన శనివారం సిట్ ముందు హాజరయ్యారు. 2009లో ‘ఆన్‌' పేరుతో ప్రారంభించిన పబ్‌లో తరుణ్‌కు భాగస్వామ్యం ఉంది. పబ్‌ ప్రారంభోత్సవానికి హాజరైన నటులపై ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్‌ వ్యవహారంలో ఆన్‌ పబ్‌కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే, పబ్‌లో తన వాటాను ఇప్పటికే తరుణ్‌ విక్రయించారు.

English summary
Actress Charmee will depose bfore Excise SIT in drugs case on July 26, may reveal more details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X