హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్స్ కేసు: రహస్య ప్రదేశంలో విచారణ, కెల్విన్ ఫోన్ లో సీక్రెట్ ఫోల్డర్, డీ కోడింగ్

డ్రగ్స్ కేసులో ప్రధాన సూత్రధారి కెల్విన్ ను తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. విచారణలో కెల్విన్ మరో ఎనిమిదిమంది పేర్లు వెల్లడించినట్లు సమాచారం.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: డ్రగ్స్ కేసులో ప్రధాన సూత్రధారి కెల్విన్ ను తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. విచారణలో కెల్విన్ మరో ఎనిమిదిమంది పేర్లు వెల్లడించినట్లు సమాచారం. నిందితులు పేర్కొన్న ఈ జాబితాలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తుంది.

డ్రగ్స్‌ మాఫియాలో ప్రధాన నిందితుడు కెల్విన్‌ ను విచారణ కోసం తమకు అప్పగించాలని ఎక్సైజ్‌ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈమేరకు రెండు రోజుల కస్టడీకి అనుమతించడంతో ఎక్సైజ్‌ అధికారులు చర్లపల్లి సెంట్రల్‌ జైలులో ఉన్న అతడిని తమ కస్టడీకి తీసుకున్నారు.

రహస్య ప్రదేశానికి ప్రధాన నిందితులు...

రహస్య ప్రదేశానికి ప్రధాన నిందితులు...

జైలు నుంచి నిందితుల‌ను క‌స్ట‌డీలోకి తీసుకున్న పోలీసులు అనంత‌రం వారిని హైద‌రాబాద్‌లోని ఎక్సైజ్ శాఖ కార్యాల‌యానికి త‌ర‌లించారు. అక్క‌డ కాసేపు విచార‌ణ జ‌రిపిన అధికారులు ప్ర‌స్తుతం వారిని ర‌హ‌స్య ప్రాంతానికి త‌ర‌లించారు. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు కెల్విన్ స‌హా కుంద‌న్‌, వాహిద్‌ల‌ను పోలీసులు ర‌హ‌స్య ప్రాంతంలో విచారించ‌నున్నారు.

కెల్విన్ ఫోన్ లో సీక్రెట్ ఫోల్డర్...

కెల్విన్ ఫోన్ లో సీక్రెట్ ఫోల్డర్...

బాలానగర్ ఎక్సైజ్ కార్యాలయంలో సిట్‌ బృందం అతడిని విచారించింది. కెల్విన్ తోపాటు, ఖుద్దుస్‌, వాహిద్‌లను కూడా సిట్‌ అధికారులు విచారించారు. మరోవైపు కెల్విన్‌ ఫోన్‌లో సీక్రెట్‌ ఫోల్డర్ ను అధికారులు డీకోడ్‌ చేశారు.

రెడీ అవుతోన్న రెండో జాబితా...

రెడీ అవుతోన్న రెండో జాబితా...

విచారణలో మరో ఎనిమిది మంది పేర్లను కెల్విన్ వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో తమ వద్ద ఉన్న ఆధారాలతో అధికారులు రెండో జాబితాను సిద్ధం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం మరో ముగ్గురు నిందితులు అమన్‌ నాయుడు, నిఖిల్‌శెట్టి, కుందన్‌ సింగ్ ను సిట్‌ అధికారులు సోమవారం కస్టడీలోకి తీసుకోనున్నారు.

కాల్ లిస్ట్ ఆధారంగా...

కాల్ లిస్ట్ ఆధారంగా...

కెల్విన్‌, ఖుద్దుస్‌, వాహిద్‌లను కూడా సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. కెల్విన్‌ కాల్‌లిస్ట్‌ ఆధారంగా 12మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు ఈ నెల 19 నుంచి సిట్‌ విచారణకు హాజరుకానున్నారు.

14కు చేరిన అరెస్టులు...

14కు చేరిన అరెస్టులు...

ఇప్పటివరకూ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయినవారి సంఖ్య 14కి చేరింది. ఇక కెల్విన్‌కు సినీ నటులు, డైరెక్టర్‌కు డ్రగ్స్‌తో సంబంధాలున్నాయని వెలుగులోకి రావడంతో పాటు, కొన్ని ప్రముఖ విద్యాలయాల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవాడనే ఆరోపణలున్నాయి.

English summary
SIT taken Kelvin into their custody and started enquiry regarding drugs case. Officials of the police succeeding in decode of secret folder which is kept secretly in Kelvin's mobile phone. After interragation Kelvin also told them some more interesting facts of the case it seems. After taking details from Kelvin police officials are preparing second list of the drugs users in the film industry. SIT also thinking to take Aman Naidu, Kundan Singh & Nikhil Shetty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X