వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలో మరిన్ని పేర్లు అకున్ షాకింగ్, అంతా చట్టప్రకారమే, కెసిఆర్ సీరీయస్

ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నవారితో త్వరలో మరిన్ని పేర్లు బయటకు వస్తాయని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ చెప్పారు. సినీ ప్రముఖుల మూడోరోజు సుబ్బరాజును సుదీర్ఘంగా విచారించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నవారితో త్వరలో మరిన్ని పేర్లు బయటకు వస్తాయని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ చెప్పారు. సినీ ప్రముఖుల మూడోరోజు సుబ్బరాజును సుదీర్ఘంగా విచారించారు.

డ్రగ్ కేసు: వ్యూహాత్మకంగా 'సిట్', బయటకు వస్తోన్న పేర్లు, ఇక వారికి సినిమానే?డ్రగ్ కేసు: వ్యూహాత్మకంగా 'సిట్', బయటకు వస్తోన్న పేర్లు, ఇక వారికి సినిమానే?

శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. అందేకాదు కొన్ని తెలుగు మీడియా ఛానెల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మూడు రోజులుగా డ్రగ్స్ కేసుపై విచారణ ాగుతోంది. ఈ నెల 27వ, తేది వరకు ఈ విచారణ సాగుతోంది.

అయితే ఇప్పటివరకు సాగిన విచారణలో వచ్చిన సమాచారం ఆధారంగా కూడ రానున్న రోజుల్లో విచారణను చేసే అవకాశం ఉంది. పూరీ బ్యాచ్ కు చెందిన సుబ్బరాజు ఇచ్చిన సమాచారం మేరకు సినీ ఇండస్ట్రీలో ఇంకా మరికొందరి పేర్లు బయటకు వచ్చాయంటున్నారు.

బిగుస్తున్న ఉచ్చు: కీలక సమాచారాన్ని ఇచ్చిన సుబ్బరాజు, వారికి దెబ్బేనా?బిగుస్తున్న ఉచ్చు: కీలక సమాచారాన్ని ఇచ్చిన సుబ్బరాజు, వారికి దెబ్బేనా?

హైద్రాబాద్ నగరంలో డ్రగ్ మాఫియా విస్తరించింది. అయితే క్లబ్, పబ్‌లు కేంద్రంగా ఈ దందా సాగుతోందని సుబ్బరాజు వెల్లడించారు. అయితే ఈ సమాచారం ఆధారంగానే పబ్, క్లబ్ యజమానులతో విచారించనున్నారు.

చట్టప్రకారంగానే వ్యవహరిస్తున్నాం

చట్టప్రకారంగానే వ్యవహరిస్తున్నాం

చట్టప్రకారంగానే తాను వ్యవహరిస్తున్నట్టు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ చెప్పారు. సినిమా పరిశ్రమను టార్గెట్ చేయలేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న వారితో మరిన్ని కొత్త పేర్లు బయటకు రానున్నట్టు చెప్పారు. డ్రగ్ కేసులో అరెస్టైన కెల్విన్ నుండి కీలకసమాచారాన్ని సేకరించినట్టు అకున్ చెప్పారు. ఈ సమాచారం ఆధారంగానే విచారణ చేస్తున్నట్టు చెప్పారాయన. ఎవర్నీ వదలబోమని చెప్పారాయన.

 నైపుణ్యం ఉన్న అధికారులున్నారు

నైపుణ్యం ఉన్న అధికారులున్నారు

ఎక్సైజ్ శాఖలో కూడ నైపుణ్యం ఉన్న అధికారులున్నారని అకున్ సబర్వాల చెప్పారు. ఈ విచారణలో ఎక్సైజ్ శాఖకు పూర్తి అధికారాలున్నాయని కూడ ఆయన చెప్పారు. వ్యక్తిగతంగా ఎవరిని ఈ విషయంలో టార్గెట్ చేసుకోలేదని చెప్పారు. తాను అతిగా వ్యవహరించలేదన్నారు. అంతేకాదు చట్టప్రకారంగానే వ్యవహరిస్తున్నట్టు చెప్పారు.

ముఖ్యమంత్రి సీరియస్

ముఖ్యమంత్రి సీరియస్

హైద్రాబాద్‌లో డ్రగ్స్ వ్యవహరంపై ముఖ్యమంత్రి కెసిఆర్ సీరియస్‌గా ఉన్నారని, తమకు స్పష్టమైన ఆదేశాలిచ్చారని అకున్ సబర్వాల్ చెప్పారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు ఇప్పటికే 12 మందికి నోటీసులు ఇచ్చారు. వారి విచారణ సాగుతోందన్నారు. విచారణ గురించి ఇప్పుడే బయటపెట్టడం సరికాదన్నారు. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులని ఏయే ప్రశ్నలు అడగాలో దానిమీదే దృష్టిపెట్టామన్నారు. సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు చేస్తున్న ప్రకటనలపై తాను ఏమీ మాట్లాడలేదన్నారు

స్కూల్స్, సాఫ్ట్‌వేర్ సంస్థలపై కేంద్రీకరణ

స్కూల్స్, సాఫ్ట్‌వేర్ సంస్థలపై కేంద్రీకరణ


సిని పరిశ్రమే కాదు, స్కూల్స్, సాఫ్ట్‌వేర్ సంస్థలపై కూడ కేంద్రీకరించినట్టు చెప్పారు. ఆయా సంస్థల్లో డ్రగ్స్ సేల్స్ కు సంబంధించిన ఘటనలపై విచారణ జరుపుతున్నట్టు చెప్పారు.అంతేకాదు విద్యాసంస్థల్లో డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆయా స్కూళ్ళు, కాలేజీల యాజమాన్యాలతో సమావేశాలను నిర్వహించినట్టు చెప్పారు. తల్లిదండ్రులు కూడ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

English summary
chandravadan, subbaraju, puri jagannath, sit shyam k naidu, kelvin, drug case, sit, charmi kaur, డ్రగ్ కేసు, సిట్, పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, శ్యామ్ కె నాయుడు, కెల్విన
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X