వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రగ్స్ కేసు: యువతులకు మత్తు వల, ఆపైన బ్లాక్ మెయిలింగ్, చైన్ సిస్టంలో విక్రయాలు...

డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ విచారణలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో బడాబాబుల మూలాలు బయటపడినట్లు సమాచారం.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ విచారణలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో బడాబాబుల మూలాలు బయటపడినట్లు సమాచారం.

కెల్విన్ ను రెండు రోజుల కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు ఆదివారం సాయంత్రం వరకు అతడ్ని విచారించి అనంతరం కోర్టులో హాజరుపరిచారు. అతడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు మరో రెండు రోజులపాటు పోలీసు కస్టడీకి కోరాలని అధికారులు నిర్ణయించారు.

హయత్ నగర్ పీఎస్ లో రహస్యంగా...

హయత్ నగర్ పీఎస్ లో రహస్యంగా...

డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ ను తొలుత ఎక్సైజ్ ప్రధాన కార్యాలయంలో విచారించాలని సిట్ అధికారులు భావించారు. అయితే మీడియా హడావుడి చేయడంతో ఇక లాభం లేదనుకుని రహస్యంగా హయత్ నగర్ లోని ఎక్సైజ్ పోలీసుస్టేషన్ కు తరలించారు. రెండ్రోజుల విచారణ పూర్తయిన వెంటనే తిరిగి అతడిని కోర్టులో హాజరుపరిచారు. కస్టడీలో కెల్విన్ వెల్లడించిన అంశాలపై సిట్ అధికారులు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అకున్ సబర్వాల్ తో పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో రిమాండులో ఉన్న మరికొంతమందిని కూడా మళ్లీ తమ కస్టడీలోకి తీసుకుని విచారించే ఉద్దేశంలో ఉన్నారు.

పెద్ద తలకాయలపై ఆరా...

పెద్ద తలకాయలపై ఆరా...

కెల్విన్ నుంచి సేకరించిన సమాచారంతో డ్రగ్స్ మాఫియాతో లింకులున్న పెద్ద తలకాయలు ఎవరన్నదానిపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. విచారణలో కెల్విన్ వ్యక్తిగత వివరాలను కూడా పోలీసులు సేకరించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన కెల్విన్ వ్యక్తిగత కారణాలతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యేవాడు. ఆ ఒత్తిడి నుంచి బయటపడేందుకు గంజాయికి బానిసయ్యాడు.

యువతులకు డ్రగ్స్ వల... బ్లాక్ మెయిలింగ్

యువతులకు డ్రగ్స్ వల... బ్లాక్ మెయిలింగ్

తొలుత గంజాయికి బానిపైన కెల్విన్ ఆ తరువాత కొంతమంది అజ్ఞాత వ్యక్తుల ద్వారా డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయో తెలుసుకున్నాడు. అడ్డదారుల్లో డ్రగ్స్ సంపాదించిన అతను ఆ మత్తులో పలువురు యువతులకు గాలం వేశాడు. వారిని మత్తుకు బానిసలుగా చేసి, లైంగికంగా కూడా వాడుకునేవాడు. ఆ తరువాత వారిని బ్లాక్‌మెయిల్ చేయడం ద్వారా మరికొంతమందితో లింకులు పెంచుకుంటూ క్రమంగా తన డ్రగ్స్ వ్యాపారాన్ని విస్తరింపజేశాడు. ఇలా అంచెలంచెలుగా హైదరాబాద్ డ్రగ్ డాన్‌గా ఎదిగాడు.

అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్ తో...

అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్ తో...

మూణ్ణెల్ల క్రితం ఎైక్సెజ్ పోలీసులకు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్‌కాల్‌పై ఎైక్సెజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ప్రత్యేక దృష్టి సారించి ఆరా తీయగా తొలుత గంజాయి, తర్వాత డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి. ఈ క్రమంలోనే ఎైక్సెజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం కెల్విన్‌ను పట్టుకుంది. కెల్విన్ వద్ద ఉన్న రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేసిన పోలీసులు వాటి కాల్‌ డాటాను పరిశీలించారు.

తీగ లాగి.. డొంక కదిలించారు...

తీగ లాగి.. డొంక కదిలించారు...

కెల్విన్ మొబైల్ ఫోన్ల కాల్ డేటాలో కొన్ని నంబర్లకు అతడు యాభైసార్లకు పైగా మాట్లాడినట్లు కనిపించడంతో.. ఆ నంబర్లు ఎవరివన్నవి పరిశీలించడం ద్వారా అతను డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తమ విచారణలో కెల్విన్ ఇచ్చిన సమాచారాన్ని నిర్ధారించుకునేందుకు అతడు తన వ్యాపారం కోసం వాడుకున్న యువతులను కూడా విచారించేందుకు సిట్ బృందం సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. విచారణలో కెల్విన్ మరొకొన్ని కొత్త పేర్లు కూడా బయటపెట్టినట్లు సమాచారం.

తొలుత విద్యార్థులు.. ఆపైన సినీ పరిశ్రమ

తొలుత విద్యార్థులు.. ఆపైన సినీ పరిశ్రమ

టీనేజి విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ దందా ప్రారంభించి అనతికాలంలోనే సినీ పరిశ్రమకు తన వ్యాపారాన్ని విస్తరించినట్లు కెల్విన్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో చదివే టీజేజి విద్యార్థులకు డ్రగ్స్ విక్రయించేవాడు. సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది వ్యక్తుల పరిచయంతో అతడి దశ తిరిగింది.

ఎవరీ గోవా బాబు?

ఎవరీ గోవా బాబు?

గోవా కేంద్రంగా డ్రగ్స్ వ్యాపారం చేస్తూ.. పెద్ద మొత్తంలో ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ మాదకద్రవ్యాలను కెల్విన్ తెప్పించి సరఫరా చేసేవాడు. గోవాలో ఇంతమొత్తంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నది ఎవరనే కోణంలో సిట్ అధికారులు ఆరా తీయగా ‘గోవా బాబు' అనే పేరును కెల్విన్ వెల్లడించాడు. గోవా బాబు నుంచి డ్రగ్స్ నగరానికి సరఫరా అవుతున్నాయని, అయితే ప్రస్తుతం అతను కాంటాక్టులో లేడని కెల్విన్ చెప్పినట్లు సమాచారం. గోవాలోని బీచ్‌లలో మాదకద్రవ్యాలను విచ్చలవిడిగా విక్రయిస్తారని, అక్కడి నుంచి రైలు మార్గం లేదా కొరియర్ సంస్థల ద్వారా దిగుమతి చేసుకుంటామని విచారణలో వెల్లడించాడు.

చైన్ సిస్టం ద్వారా అమ్మకాలు...

చైన్ సిస్టం ద్వారా అమ్మకాలు...

మొదట టీనేజ్ విద్యార్థులకు డ్రగ్స్ అలవాటు చేసి వ్యాపారాన్ని విస్తరించిన కెల్విన్ కొన్ని విద్యా సంస్థల ప్రాంగణాల వద్ద అడ్డాలను ఏర్పాటు చేసుకుని అమ్మకాలు సాగించాడు. పేరు మోసిన విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల ద్వారా సినిమా పరిశ్రమతో సంబంధాలు ఏర్పడడంతో చైన్ సిస్టం ద్వారా దాదాపు 10 వేల మందిని కెల్విన్ తన వినియోగదారులుగా చేర్చుకున్నట్లు సమాచారం.

సినీ ప్రముఖులకు వారి డ్రైవర్లతో...

సినీ ప్రముఖులకు వారి డ్రైవర్లతో...

సినిమా రంగానికి డ్రగ్స్ సరఫరా చేయడం వల్లే ఎక్కువ సంపాదించినట్లు కెల్విన్ విచారణలో ఒప్పుకొన్నట్లు తెలిసింది. నాలుగేళ్లుగా సినిమారంగానికి డ్రగ్స్ సరఫరా జరుగుతోందని, సినీ ప్రముఖులకు వారి డ్రైవర్ల ద్వారా డ్రగ్స్ సరఫరా చేసేవాళ్లమని, ప్రముఖులు మాత్రం తమ వద్దకు వచ్చే వారుకాదని కెల్విన్ చెప్పాడు. పెద్దపెద్ద పార్టీలకు, ఈవెంట్లకు మత్తు పదార్థాలను సరఫరా చేసినట్లు కూడా కెల్విన్ ఒప్పుకున్నాడు.

కొరియర్ సంస్థలపైనా దృష్టి...

కొరియర్ సంస్థలపైనా దృష్టి...

డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు కొరియర్ సంస్థల పీకకు చుట్టుకుంది. సిట్ అధికారుల విచారణలో కెల్విన్ తాను గోవా నుంచి రైలు మార్గం లేదా కొరియర్ సంస్థల ద్వారా హైదరాబాద్ కు డ్రగ్స్ తెప్పించేవాడినని పేర్కొనడంతో అధికారుల దృష్టి కొరియర్ సంస్థలపైనా పడింది. దీంతో కెల్విన్ చెప్పిన ఇండియా పోస్ట్, డీహెచ్ఎల్ కొరియర్ సంస్థలకు కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు. గోవాలో ఈ డ్రగ్స్ ను ఎవరు బుక్ చేశారు? ఇక్కడ హైదరాబాద్ లో ఎవరు పార్సిల్స్ తీసుకున్నారు? ఈ కోణంలో కొరియర్ సంస్థల ప్రతినిధులను కూడా విచారించేందుకు సిద్ధమవుతున్నారు.

English summary
In SIT Officials interrogation.. Prime Accused Kelvin revealed many new things it seems. After taking him to for 2 days custody SIT Officials secretly shifted Kelvin to Hayat Nagar Excise Police Station. There they have questioned in various aspects and angles. Kelvin told them that he is bringing drugs from GOA to Hyderabad through rail or courier service. He targeted some school students first, later with their help kelvin had establish relations with cinema field. Totally he has 10000 customers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X