హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రియుడి కోసం డాక్టర్ అవతారం: గాంధీ ఆసుపత్రిలో హల్‌చల్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో నకిలీ డాక్టర్‌ని సెక్యూరిటీ గార్డులు పట్టుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శివాని అలియాస్ సంధ్య (25) సోమవారం ఉదయం గాంధీ ఆసుపత్రిలోని ఓపీ విభాగంలో ఉదయం నుంచి మెడలో స్టెతస్కోప్, యాప్రాన్ కోటు ధరించి ఓపీ విభాగంలో తిరుగుతుండగా వార్డ్ బాయ్ గమనించి ఆరా తీశారు.

ఎవరు నువ్వంటూ వార్డు బాయ్ ప్రశ్నించగా నేను డాక్టర్‌ని నన్నే ఆపుతావా అంటూ వార్డు బాయ్‌ను బెదిరించడంతో అనుమానం వచ్చి భద్రతా సిబ్బందికి తెలిపాడు. దీంతో వారు ఆమెను ఆసుపత్రి ఎల్ఆర్ఎంఓ వద్దకు తీసుకెళ్లి విచారించగా అసలు విషయం బయట పడింది.

 గాంధీ ఆసుపత్రిలో పట్టుబడ్డ నకిలీ డాక్టర్

గాంధీ ఆసుపత్రిలో పట్టుబడ్డ నకిలీ డాక్టర్

గాంధీ ఆసుపత్రిలో నకిలీ డాక్టర్‌ని సెక్యూరిటీ గార్డులు పట్టుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శివాని అలియాస్ సంధ్య (25) సోమవారం ఉదయం గాంధీ ఆసుపత్రిలోని ఓపీ విభాగంలో ఉదయం నుంచి మెడలో స్టెతస్కోప్, యాప్రాన్ కోటు ధరించి ఓపీ విభాగంలో తిరుగుతుండగా వార్డ్ బాయ్ గమనించి ఆరా తీశారు.

 గాంధీ ఆసుపత్రిలో పట్టుబడ్డ నకిలీ డాక్టర్

గాంధీ ఆసుపత్రిలో పట్టుబడ్డ నకిలీ డాక్టర్


గాంధీ ఆసుపత్రిలో మూడేళ్ల క్రితం ఓ అపరిచితురాలు డాక్టర్ వేషంలో వచ్చి రోగికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి మూడు తులాల బంగారు గొలుసు అపహరించుకుని పోయింది.

 గాంధీ ఆసుపత్రిలో పట్టుబడ్డ నకిలీ డాక్టర్

గాంధీ ఆసుపత్రిలో పట్టుబడ్డ నకిలీ డాక్టర్


ఉస్మానియాలో అయిదేళ్ల క్రితం ఓ అపరిచితురాలు వార్డులోని ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారు. భయంతో వారు అరవడంతో వారు పారిపోయారు.

గాంధీ ఆసుపత్రిలో పట్టుబడ్డ నకిలీ డాక్టర్

గాంధీ ఆసుపత్రిలో పట్టుబడ్డ నకిలీ డాక్టర్


నాలుగేళ్ల క్రితం నిలోఫర్‌లో ఓ బిడ్డను అపహరించడానికి ఓ మహిళ ప్రయత్నం చేస్తుండడంతో అప్రమత్తమైన రోగుల బంధువులు ఆమెను పట్టుకున్నారు.

ఎల్ఆర్ఎంఓ హైమావతి విచారించగా తన పేరు సంధ్య అని, ఓ నర్సింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నట్లు వివరించింది. ఆ సమాచారం తప్పని తేలడంతో సంధ్యను చిలకలగూడ పోలీసులకు అప్పగించారు.

మరోవైపు ఈ యువతి పలుమార్లు ఫోన్ చేసిన ప్రియుడు బేగంపేటకు చెందిన అఖిల్ (22)ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఓపీలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అవుట్ పోస్ట్ ఇన్ ఛార్జి వెంకట్రావ్ తెలిపారు.

ఇది ఇలా ఉంటే ఆసుపత్రిలోని ఓపీ విభాగంలో సోమవారం ఓ చోరీ సంఘటన వెలుగుచూసింది. జీడిమెట్ల ఐడీపీఎల్ గాంధీనగర్‌కు చెందిన విజయ చేతిలో ఉన్న సంచిని ఎవరో కత్తిరించారు. అందులో రూ. 3వేల నగదు, అరతులం బంగారు ఉందని ఆమె వైద్యాధికారులకు ఫిర్యాదు చేసింది.

English summary
Duplicate Doctor in Gandhi Hospital, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X