వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారు: జగన్‌కు ఈడీ మరో భారీ షాక్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఈడీ మరో షాక్ ఇచ్చింది. జగన్ ఆస్తుల కేసులో ఈడీ మరో ఛార్జీషీట్ దాఖలు చేసింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఈడీ మరో షాక్ ఇచ్చింది. జగన్ ఆస్తుల కేసులో ఈడీ మరో ఛార్జీషీట్ దాఖలు చేసింది.

జగన్ 'బెయిల్': ల్యాప్‌టాప్‌లో జడ్జికి రమాకాంత్ ఇంటర్వ్యూ చూపిన సిబిఐజగన్ 'బెయిల్': ల్యాప్‌టాప్‌లో జడ్జికి రమాకాంత్ ఇంటర్వ్యూ చూపిన సిబిఐ

పెన్నా సిమెంట్స్‌కు సంబంధించిన కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. జగన్‌తో పాటు వైసిపి నేత, రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి, పెన్నా ప్రతాప్ రెడ్డి తదితరులపై నేరారోపణ చేసింది.

రూ.152 కోట్లు జఫ్తు చేశాం: జగన్ ఆస్తులపై ఈడీ ఝలక్, హైకోర్టుకురూ.152 కోట్లు జఫ్తు చేశాం: జగన్ ఆస్తులపై ఈడీ ఝలక్, హైకోర్టుకు

మనీ లాండరింగ్

మనీ లాండరింగ్

పెన్నా సిమెంట్స్‌కు సంబంధించిన కేసులో ఈడీ ఇప్పటికే పెన్నా ప్రతాప్ రెడ్డి, జగన్ తదితరులపై కేసు నమోదు చేశారు. మనీ లాండరింగ్ కేసులో దీనిని నమోదు చేశారు. దీనిపై ఈడీ తాజాగా ఛార్జీషీట్ దాఖలు చేసింది.

ప్రతాప్ రెడ్డికి అనుచిత లబ్ధి కల్పించారని...

ప్రతాప్ రెడ్డికి అనుచిత లబ్ధి కల్పించారని...

వైయస్ జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెన్నా ప్రతాప రెడ్డికి సంబంధించిన కొన్ని సంస్థలకు అనుచిత లబ్ధి కల్పించారని, తద్వారా ప్రతాప్ రెడ్డి కోట్లాది రూపాయల లాభం పొందారని ఆరోపణలు ఉన్నాయి.

కర్నూలు, బంజారాహిల్స్‌లలో..

కర్నూలు, బంజారాహిల్స్‌లలో..

కర్నూలులోని 304 ఎకరాల్లోని గనులను పెన్నా ప్రతాప్ రెడ్డికి ఇచ్చారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్ నిర్మాణానికి సంబంధించి అనుమతులు ఇవ్వడంలో కూడా లబ్ధి కల్పించారనే ఆరోపణలు ఉన్నాయి.

జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి..

జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి..

ఈ మేరకు జగన్ కంపెనీల్లో పెన్నా ప్రతాప్ రెడ్డి పెట్టుబడులు పెట్టారనే విషయం నిర్ధారణ అయినట్లు ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేసింది. పెన్నా ప్రతాప్ రెడ్డి.. జగన్ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే రూ.7.85 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

ఆస్తుల అటాచ్..

ఆస్తుల అటాచ్..

పెన్నా సిమెంట్స్ తదితర ఆస్తులపై ఈడీ అటాచ్‌మెంట్స్ కొనసాగుతున్నాయి. ఈ ఛార్జీషీటులో పెన్నా ప్రతాప్ రెడ్డి, వైయస్ జగన్, విజయ సాయి రెడ్డిల పేర్లను ప్రస్తావించారు.

English summary
ED filed another charge sheet in YSR Congress party chief YS Jaganmohan Reddy's DC case on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X