వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైద్రాబాద్ కు చేరుకొన్న శ్రీనివాస్ మృతదేహం, దుఖ:సాగరంలో కుటుంబసభ్యులు

బుదవారం నాడు అమెరికాలో జరిగిన కాల్పుల్లో మరణించిన ఇంజనీర్ శ్రీనివాస్ మృతదేహం సోమవారం నాడు హైద్రాబాద్ కు చేరుకొంది.మృతదేహన్ని కుటుంబసభ్యులు చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:అమెరికాలోని కేన్సాన్ లోని ఓ బార్ లో జరిగిన కాల్పుల్లో మరణించిన ఇంజనీర్ శ్రీనివాస్ కూచిబొట్ల మృతదేహం సోమవారం రాత్రి హైద్రాబాద్ కు చేరుకొంది.

32 ఏళ్ళ శ్రీనివాస్ కూచిబొట్ల పై కేన్సాన్ లోని బార్ లో అమెరికాకు చెందిన ఆడమ్ ప్యూరింటన్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. తమ దేశాన్ని విడిచివెళ్ళాలని అరుస్తూ శ్రీనివాస్ పై కాల్పులు జరిపాడు.ఈ కాల్పుల ఘటనలో ఆలోక్ అనే భారతీయుడు సురక్షితంగా తప్పించుకొన్నాడు.ఆలోక్ , శ్రీనివాస్ ఇద్దరూ స్నేహితులు.వారిద్దరూ కలిసే బార్ కు వచ్చారు.

srinivas kuchibhotla

అయితే ఆడమ్ ప్యూరింటన్ కాల్పులు జరపకుండా అడ్డుకొన్న గ్రిల్లాట్ అనే వ్యక్తి గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీనివాస్ ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు.

మరో వైపు శ్రీనివాస్ మృతదేహం సోమవారం రాత్రి హైద్రాబాద్ కు చేరుకొంది. బుదవారం ఈ ఘటన జరగడంతో మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.శంషాబాద్ విమానాశ్రయంలో కుటుంబసభ్యులు శ్రీనివాస్ మృతదేహన్ని చూడగానే కన్నీరు మున్నీరుగా విలపించారు.

జాత్యంహకార దాడిలో శ్రీనివాస్ మరణించాడు.శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోనే శ్రీనివాస్ మృతదేహనికి రాజకీయపార్టీ నాయకులు ప్రముఖులు నివాళులర్పించారు.శ్రీనివాస్ ఇంటి వద్దకు మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య మృతదేహం వచ్చేవరకు ఎదురుచూశారు. మృతదేహం వచ్చిన తర్వాత నివాళులర్పించి వెళ్ళారు.

English summary
techie Srinivas Kuchibhotla's dead body reached hyderabad on monday night .An Indian engineer was killed in a shooting in a Kansas City bar on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X