వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రగ్స్ కేసు: ‘ఎఫ్’ క్లబ్ లైసెన్స్ రద్దు, 14 పబ్ లు, బార్ లకు సీరియస్ వార్నింగ్

డ్రగ్స్ మాఫియా కేసులో సిట్ దూకుడు పెంచింది. నిబంధనలు అతిక్రమించిన ‘ఎఫ్’ క్లబ్ లైనెన్స్ ను రద్దు చేసింది. అంతేకాకుండా, మరో 14 పబ్ లు, బార్ లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్స్ మాఫియా కేసులో సిట్ దూకుడు పెంచింది. నిబంధనలు అతిక్రమించిన 'ఎఫ్' క్లబ్ లైనెన్స్ ను రద్దు చేసింది. అంతేకాకుండా, మరో 14 పబ్ లు, బార్ లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

ఇప్పటికే డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు మరోవైపు నోటీసులు జారీ చేసిన వారిని విచారిస్తున్నారు.

f-club

శనివారం హైదరాబాద్ లోని పబ్ లు, బార్ ల యజమానులతో సమావేశమైన అధికారులు డ్రగ్స్ విషయంలో వారిని తీవ్రంగా హెచ్చరించారు. డ్రగ్స్ విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొన్నవారు వెల్లడించిన వివరాల మేరకు పబ్ లలోనే డ్రగ్స్ కల్చర్ ఉన్నట్లు సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చి.. ఆయా పబ్ లపై దృష్టి సారించారు.

తాజాగా ఇద్దరి అరెస్ట్...

అలాగే డ్రగ్స్ కేసులో తాజాగా మహ్మద్ ఉస్మాన్, అర్నవ్ మండల్ అనే ఇద్దరిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితుల నుంచి 20 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.

English summary
After a meeting with various representatives of pubs and star hotels in connection with drug abuse, Excise officials on Saturday evening declared that the license of F-Club in Film Nagar, is suspended and 14 other bars and clubs in the city were issued warning letters, as some of the bars and restaurants/pubs have become addas for sale, consumption of drugs. The decision was taken based on the information that the investigators got about the nexus among the drug peddlers, students, some members of Tollywood, some employees of MNCs and several others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X