హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ బంద్, ఉద్రిక్తం: బిజెపి కార్యకర్తపై కత్తితో దాడి, ఆలస్యంగా జానారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రైతు ఆత్మహత్యల నేపథ్యంలో విపక్షాలు ఇచ్చిన బంద్ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది. బందులో పాల్గొంటున్న విపక్ష నేతలను పోలీసులు ఎక్కడికి అక్కడ అరెస్టు చేస్తున్నారు. దీంతో, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి.

ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా, ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. బంద్‌కు సహకరించడం లేదంటూ సిరిసిల్ల, హుస్నాబాద్, ప్రజ్ఞాపూర్ తదితర కొన్ని ప్రాంతాల్లో బస్సు అద్దాలు పగులగొట్టారు.

భాగ్యనగరంలోని మహాత్మా గాంధీ బస్ట స్టేషన్ ఎదుట కాంగ్రెస్, సిపిఐ నేతలు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్, జానా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సిపిఐ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

 Farm loan waiver issue: Telangana Bandh partial in Hyderabad

వారిని పోలీసులు అరెస్టు చేసి, గోషామహల్ పోలీసు స్టేషన్ తరలించారు. దీంతో, వారు ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. కెసిఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి నిరంకుశ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు చూడలేదన్నారు.

జూబ్లీ బస్ స్టేషన్ వద్ద టిడిపి, బిజెపి నాయకులు ధర్నాకు దిగారు. బస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగిన ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర రావు, డాక్టర్ కె లక్ష్మణ్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు.

తమను జైల్లో పెట్టినా రైతుల కోసం ఉధ్యమాన్ని ఆపేది లేదని మండిపడ్డారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. కాగా, తెలంగాణలోని పది జిల్లాల్లో బస్ స్టేషన్ల ఎదుట ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో, చాలా బస్సులు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి. కొన్నిచోట్ల బస్సులు నడుస్తున్నాయి. హైదరాబాదులో బస్సులు పాక్షికంగా నడుస్తున్నాయి.

వనస్థలిపురంలో ఉద్రిక్తం

బంద్ సందర్భంగా వనస్థలిపురం ఎన్టీఆర్ నగర్‌లో ఉద్రిక్తత ఏర్పడింది. బంద్‌కు మద్దతుగా దుకాణాలు బంద్ చేయిస్తున్న వారి పైన ఓ దుకాణం యజమాని కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఓ బిజెపి కార్యకర్తకు తీవ్రగాయాలయ్యాయి. అతనిని ఆసుపత్రికి తరలించారు.

విపక్షాలు రైతుల కోసం మద్దతుగా బంద్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాదులో పలుచోట్ల తిరుగుతున్న బస్సుల పైన పలువురు రాళ్లతో దాడి చేశారు. అబిడ్స్, క్రాస్ రోడ్డు తదితర చోట్ల బస్సుల అద్దాలు పగిలాయి.
బంద్ సందర్భంగా ఉదయం నుంచే పోలీసులు నిరసనకారులను అరెస్టు చేస్తున్నారు.

అందుకే ఆలస్యం: జానారెడ్డి

తెలంగాణ బంద్ నేపథ్యంలో హైదరాబాదులోని గోషా మహల్ వద్ద అరెస్టైన కాంగ్రెస్ పార్టీ నేతలను ఆ పార్టీ శాసన సభా పక్ష నేత జానారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం అన్ని పార్టీలు ఒకటి కావటం శుభపరిణామమన్నారు.

ప్రజా సమస్యలపై పోరాటానికి ఇక ముందు కూడా విపక్షాలు ఐక్యత చాటుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జైళ్లకు వెళ్లేందుకైనా సిద్ధమన్నారు. బంద్‌ను విఫలం చేసేందుకు భయపెట్టి, బలవంతం చేసి దుకాణాలను మళ్లీ తెరిపిస్తోందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. నేటి బంద్‌లో పాల్గొనలేదంటూ వచ్చిన విమర్శలపై స్పందిస్తూ... అనారోగ్యం కారణంగా తాను ఆలస్యంగా వచ్చానని చెప్పారు. అనంతరం జానా రెడ్డి నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేశారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలన్నారు. తమను అరెస్టు చేసినా ఫరవాలేదని, రుణమాఫీ చేస్తే చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

English summary
Telangana Bandh partial in Hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X