హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం: లిఫ్ట్‌లో చిక్కుకుని వ్యక్తి సజీవదహనం (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కూకట్‌పల్లిలోని ఓరియన్ ఫర్నిషింగ్స్ షోరూమ్‌లో శుక్రవారం రాత్రి జరిగిన అగ్రిప్రమాదంలో సోఫా టైలర్ అగనికి ఆహుతయ్యాడు. లిఫ్ట్‌లో ఎక్కిన సమయంలోనే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో శంషుద్దీన్ (45) సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఈ షోరూమ్‌లోని మూడో అంతస్తులో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు అలుముకోవటంతో ఏమి జరుగుతుందో అర్ధంకాని అయోమయ పరిస్ధితి నెలకొంది.

 లిఫ్ట్‌లో చిక్కుకుని వ్యక్తి సజీవదహనం

లిఫ్ట్‌లో చిక్కుకుని వ్యక్తి సజీవదహనం

ఆ సమయంలో షోరూమ్‌లో మొత్తం అరుగురు సిబ్బంది ఉండగా, ఐదుగురు బయటకు పరుగులు తీశారు. ఎల్లమ్మబండలో నివసించే శంషుద్దీన్ మూడో అంతస్తులో చిక్కుకుపోయాడు.

 లిఫ్ట్‌లో చిక్కుకుని వ్యక్తి సజీవదహనం

లిఫ్ట్‌లో చిక్కుకుని వ్యక్తి సజీవదహనం

మంటలు వ్యాపిస్తుండటంతో త్వరగా కిందకు వెళ్లాలని లిప్ట్‌లో ఎక్కాడు. లిఫ్ట్ ఆగిపోవడంతో అందులో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. అయితే లిఫ్ట్ ఆగిపోవడానికి గల ప్రధాన కారణం మాత్రం తెలియరాలేదు.

 లిఫ్ట్‌లో చిక్కుకుని వ్యక్తి సజీవదహనం

లిఫ్ట్‌లో చిక్కుకుని వ్యక్తి సజీవదహనం

మంటలు వ్యాపించకుండా ఉండటం కోసం బయటకు వచ్చిన ఇతర సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేశారని తెలుస్తోంది. మూడో అంతస్ధులో ఉన్న ఫర్నీషింగ్ మెటీరియల్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది.

 లిఫ్ట్‌లో చిక్కుకుని వ్యక్తి సజీవదహనం

లిఫ్ట్‌లో చిక్కుకుని వ్యక్తి సజీవదహనం

దీని విలువ సుమారు రూ. 50 లక్షలు ఉంటుందని షోరూమ్ నిర్హాహకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు మాత్రం షార్ట్ సర్కూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Fire accident in Kukatpally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X