శ్రీకాకుళం జిల్లాలో చేపల వర్షం, కుప్పలు తెప్పలుగా పడ్డ వైనం
శ్రీకాకుళం: ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షంతో పాటు నీటితో పాటు తమ పొలాల్లో చేపలు కూడా వచ్చి పడడంతో శ్రీకాకుళం పాతపట్నంలోని శిబ్బిలి గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. శుక్రవారం నాడు ఈ సంఘటన జరిగింది.
ఉదయం పొలం ప్రాంతానికి రైతులు చేరుకున్నారు. అక్కడ కుప్పలు కుప్పలుగా పడి ఉన్న చేపలను వారు చూశారు. తమ పొలాల్లో చేపల వర్షం కురవడంతో రైతులు వాటిని చేత పట్టుకొని చూశారు. కొన్ని చేపలను ఇంటికి తీసుకెళ్లారు.
నిన్న రాత్రి నుంచి కురుస్తోన్న వర్షాలతో శ్రీకాకుళం జలమయంగా మారింది. రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. గురువారం కూడా కురిసింది. దీంతో ఉదయం పొలాల్లోకి వెళ్లిన రైతులకు చేపలు కనిపించాయి. తుఫాను మూలంగా కురుస్తున్న వర్షాలతో పాటు చేపలు పడి ఉంటాయని భావిస్తున్నారు.

గతంలో, కృష్ణా జిల్లా నందిగామ మండలం గొళ్లమూడిలో గురువారం రాత్రి చేపల వర్షం కురిసిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా రైతులంతా రోడ్లపైనే బుట్టలు పట్టుకొని వాటిని ఏరుకుంటున్నారు. అంతే కాదు వర్షం కురిసే సమయంలో ఈ చేపలు ఏంటంటూ ఆశ్చర్యపోయారు.
పొలాల్లో, గ్రామాల్లో పడిన చేపలను ఏరుకుని ప్రజలు వాటిని ఇంటికి తీసుకెళ్లారు. అది కూడా వాలుగ రకం చేపలు కావడంతో జనం వీటి కోసం ఎగబడుతున్నారు. ఆకాశం నుంచి పడిన చేపలు 'వాలగ' రకానికి చెందినవిగా గ్రామస్థులు చెప్పారు. సుమారు మూడు నుంచి నాలుగు కిలోలు ఉన్న చేపలు కూడా ఉన్నాయి.
వర్షంతో పాటు చేపలు కురుస్తున్నాయంటూ పక్క గ్రామాల ప్రజలకు తెలియడంతో వారు కూడా అక్కడకు చేరుకుని వాటిని ఏరుకుని తీసుకెళ్తున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే గతంలో థాయ్‌లాండ్ చోటు చేసుకుంది.
చేపల వర్షం వెనుక..
చేపల వాన వెనకు పెద్ద సైన్సు ఉందని అంటున్నారు. ఆకాశం నుంచి కింద పడే చేపలు నిజంగా ఆకాశం నుంచి రాలి పడవని చెబుతున్నారు. ఇవి చుట్టుపక్కల ఉన్న సముద్రాల నుంచి వస్తాయని అంటున్నారు. ఈ విషయంపై వాతావరణ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనాల ప్రకారం వాతావరణంలోని మార్పుల వల్ల టోర్నడోలు ఏర్పడతాయి. ఈ టోర్నడోలు విపరీతమైన వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి.
ఇవి నీటిపై ప్రయాణించే సమయంలో ఆ నీటిని అపరమితమైన శక్తితో పైకి లాగుతాయి. చేపలు, కప్పలు వంటి సముద్ర జంతువులు కూడా టోర్నడోలతో పాటుగా ప్రయాణిస్తాయి. కొంచెం సేపు ప్రయాణించిన తర్వాత ఈ టోర్నడోలు శక్తి హీనమవుతాయు. అలాంటప్పుడు సముద్రంలోని చేపలు వానలా కురుస్తాయి. సాధారణంగా ఈ టోర్నడోలు కొన్ని వందల కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంటాయి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications