హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జల్సాల కోసం చోరీ: బీటెక్ విద్యార్థుల అరెస్ట్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జల్సాలు, విలాసాలకు అలవాటుపడి కొందరు, విదేశీ చదువుల కోసం మరికొందరు బీటెక్ విద్యార్థులు కలిసి చోరీలకు పాల్పడుతున్నారు. కాగా, శుక్రవారం వారిని పోలీసులకు అరెస్ట్ చేశారు. అల్వాల్ ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ కథనం ప్రకారం.. వెంకటాపురంలో నివసించే గుజ్జుల వెంకటరామిరెడ్డి మే 17న ఇంటి ముందు నిలిపి ఉంచిన కారు చోరీకి గురైంది.

బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అల్వాల్ పోలీసులు, దమ్మాయిగూడలోని ఓ అపార్ట్‌మెంట్ వద్ద కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మరింత లోతుగా విచారించిన పోలీసులు, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

బీటెక్ చోరులు

బీటెక్ చోరులు

జల్సాలు, విలాసాలకు అలవాటుపడి కొందరు, విదేశీ చదువుల కోసం మరికొందరు బీటెక్ విద్యార్థులు కలిసి చోరీలకు పాల్పడుతున్నారు. కాగా, శుక్రవారం వారిని పోలీసులకు అరెస్ట్ చేశారు.

కారు స్వాధీనం

కారు స్వాధీనం

అల్వాల్ ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ కథనం ప్రకారం.. వెంకటాపురంలో నివసించే గుజ్జుల వెంకటరామిరెడ్డి మే 17న ఇంటి ముందు నిలిపి ఉంచిన కారు చోరీకి గురైంది.

టిప్పర్ ఢీకొని మహిళ మృతి

టిప్పర్ ఢీకొని మహిళ మృతి

స్వచ్ఛ హైదరాబాద్ పనుల కోసం వినియోగిస్తున్న టిప్పర్ ఢీకొని ఓ మహిళ మృతి చెందింది.

ప్రమాదానికి కారణమైన లారీ

ప్రమాదానికి కారణమైన లారీ

మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటకు చెందిన కవిత దరత్(35) మృతికి కారణమన లారీ ఇదే.

కాప్రా జేజే కాలనీకి చెందిన వడ్డమాని మనోజ్‌కుమార్(21), వడ్లమాని వెంకటసాయి వినయ్ కుమార్(24), వెస్ట్ వెంకటాపురానికి చెందిన వి సంతోష్(20), తాళ్ల ప్రేమ్ కుమార్(20) బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నారు. వీరికి కుషాయిగూడలో నివసించే జండాల ధర్మతేజ(21)తో పరిచయం ఏర్పడింది.

ఈ క్రమంలో వీరందరూ కలిసి విలాసాలకు, భవిష్యత్తులో విదేశీ చదువులకు డబ్బు అవసరమవుతుందని చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం మే 17న వెస్ట్ వెంకటాపురంలో గుజ్జుల వెంకటరాంరెడ్డికి చెందిన ఇన్నోవా కారును ఎత్తుకెళ్లారు. దుమ్మాయిగూడలోని అపార్ట్‌మెంట్ వద్ద కారును విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు దొరికిపోయారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, రిమాండ్‌కు తరలించారు.

English summary
Five B tech students were arrested for theft a car in Hyderabad on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X